Others

శరణం అయ్యప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణికంఠుడు, పందళరాజకుమారుడు, స్వామీ, హరిహరపుత్రన్, అయ్యన్,అనుపలు నామాల తో పూజించే స్వామీయే అయ్య ప్ప. దీక్షతీసుకొన్న అయ్యప్ప భక్తులు నిరంతరమూ ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటుంటారు. దీక్షధారణలో ఏన్నో నియమాలను స్వాములు పట్టుదలతో పాటిస్తుం టారు. ఆ నియమాలలో కొన్నిం టిని చూద్దాం. గురుస్వాముల వారి ఆశీస్సులతో మాలధారణ చేస్తారు. 41దినముల కఠిన కఠోర దీక్షను చేపట్టిన వారు, నల్లని వస్త్రాలు ధరిస్తారు. స్వామి దర్శ నానికి వెళ్లినపుడు ముందు పంబాగణపతి స్వామి దర్శనం చేసుకుని అక్కడ టెంకాయ కొట్టి చిన్నపాదముతో శబరికొండ ఎక్క డ ప్రారంభిస్తారు. మార్గం మధ్యలో శరణ్‌గుత్తివద్ద కనె్నస్వాములు తమ వెంట తెచ్చిన బాణాలు గుచ్చుతుంటారు. శబరిమలకు చేరిన తరువాత 18మెట్లను నమస్కరిస్తూ ఎక్కి స్వామివారి సన్నిధానికి చేరుకుంటారు.
18వసారి దీక్షను చేపట్టి శబరిమలైకి పోయే స్వాములు విధిగా కొబ్బరిచెట్టుమొక్కను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.దీక్షతో సత్యా న్ని మాత్రమే పలుకుతుం టారు. అందుకే స్వామీకి ప్రీతి పాత్రులవు తారు. మొదటిసారి మాలధారణ చేసిన వారిని కనె్నస్వాములుగా, రెండవసారి మాలధారణ చేసినవారిని కత్తిస్వామి, మూడవసారి మాలధారణ చేసిన వారిని గంటస్వాములు, నాల్గవసారి మాలధారణ చేసిన వారిని గదస్వాములు, ఐదవసారి మాలధారణ చేసిన వారిని పెరుస్వాములు, ఆరవసారి దీక్షమాల వేసినవారిని గురుస్వాములు అని సంబోధిస్తుంటారు.

- పురందర్