Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కాలుసేతులాడక యున్న ఁ గాని దేది
లేదు జగతిన యోచింప నేది యేరి
కైన సాధ్యమే తలుపంగఁ గార్యదీక్షఁ
బూని యడుగులు గదిపినఁ బోదు ఫలము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కాళ్లు, చేతులు సరిగా పనిచేయనంత మాత్రాన ఎవ్వరికీ ఏదీ అసాధ్యమనేదే లేదు. కార్యదీక్ష పూని అడుగులు ముందుకు వేస్తే సిద్ధించే ఫలితం ఎన్నటికీ చెడిపోదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ లోకానికి ప్రబోధించవయ్యా స్వామీ.
తే.గీ. నుదుటిపై వ్రాతలనుఁ గూడా యెదనుధైర్య
సాహసమ్ముల నిల్పినఁ జక్కదిద్ద
వచ్చు సంశయంబేలయా? పచ్చినిజము
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: హృదయంలో ధైర్యసాహసోత్సాహాలను నిలుపుకున్న పక్షంలో ఆ బ్రహ్మదేవుడు రాసిన నుదుటి రాతలను కూడా చక్కదిద్దుకోవచ్చు. అనడంలో సందేహానికి తావేలేదని, కృషినాస్తి దుర్బిక్షం అని మన పెద్దలు చెప్పిన అనుభవసారాన్ని ఎవరైనా అనుభవించి తెలుసుకోవచ్చునని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్య స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262