Others

చేసే పనే పవిత్రకార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీవొక న్యాయవాదివైతే, నీ వృత్తిని మానేసి చేతి మగ్గం చేపట్టు. నీవొక డాక్టరైతే, నీ వృత్తిని వదిలేసి ఒక చేతి మగ్గం చేపట్టు’’ అని ఆయన సూచించేవాడు. ఆయన నేతగాళ్లతో ప్రత్యక్ష పరిచయం ఏర్పరచుకొని చేతి మగ్గాల గురించి సమాచారం సేకరించేవాడు. భారతదేశంలో చేతి మగ్గాలకు కేంద్రం అహ్మదాబాదు కాబట్టి ఆయన తన మొదటి ఆశ్రమాన్ని అక్కడే స్థాపించాడు. ఆశ్రమవాసులంతా స్వదేశీ దీక్షను పాటించేవారు.
వారంతా స్వయంగా వారి చేతి మగ్గాలపై తయారైన వస్త్రాలతో కుట్టిన దుస్తులనే ధరించేవారు. ‘‘నీకేది కావాలో అది నేసుకో, లేదా అది లేకుండా జీవించడం నేర్చుకో’’ అనేది నినాదంగా ఉండేది. ఒక నిపుణుడైన నేత పనివాడి ఆధ్వర్యంలో నేతలో శిక్షణ ప్రారంభమయ్యింది. కొంతమంది ఆశ్రమవాసులు రోజుకు ఎనిమిది గంటల సేపు మగ్గం నడపడం ప్రారంభించారు. 45 ఏళ్ల వయసులో గాంధీరోజుకు నాలుగయిదు గంటలు మగ్గంపై పనిచేసేవాడు. ప్రతి నేత పనివాడికీ రోజుకు 12 అణాల వేతనం లభించేది. మొదట్లో 30 అడుగుల వెడల్పైన వస్త్రాన్ని నేసేవారు. అది మహిళలు ధరించేందుకు తగిన వెడల్పు కాదు. ఆశ్రమవాసులైన మహిళలు ముక్కలతో కుట్టిన చీరలు ధరించాల్సి వచ్చేది. ఒక రోజు ఒక మహిళ తక్కువ వెడల్పు వున్న వస్త్రాన్ని ధరించడానికి ఇష్టపడక మిల్లు వస్త్రం ధరించాలనుకుంది. ఆమె భర్త గాంధీ సలహా అడిగాడు.
వెడల్పైన మగ్గంపై పనిచేయడం నేర్చుకోమని గాంధీ సూచించాడు. తర్వాత త్వరలోనే వెడల్పైన ధోవతీలు, మహిళలకు అనువైన చీరలు ఆశ్రమంలోనే తయారుకాసాగాయి. బయట నేతవాళ్లు చేతితో తయారుచేసిన నూలు వాడేవారు కానీ, దానితో వస్త్రాలు నేయడం, మిల్లు నూలుతో నేయడంకన్నా కష్టం కాబట్టి ఎక్కువ డబ్బులు వసూలుచేసేవారు. స్వాతంత్య్రం తర్వాత ఒక ఖాదీ కార్యకర్త నూలు వడికేవాళ్లకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని సూచించాడు. నేతగాళ్లు వాళ్ల కోటా చేతి నూలును వడికితే తప్ప వారికి మిల్లు నూలు కోటా విడుదల చేయకూడదని మరొకరు సూచించారు. కానీ ఏ రకమైన నిర్బంధమైనా అది ఖాదీమీద వ్యతిరేకతకు దారితీస్తుంది కాబట్టి అలాంటి నిబంధనలు ఏవీ గాంధీకి ఇష్టంలేదు. నేతగాళ్ల కష్టం తగ్గించేలా మంచి నూలు తయారుచేయాలని ఆయన సూచించాడు. మిల్లు నూలు మీద ఆధారపడటం చివరకు వారి వృత్తికే ఎసరుపెడుతుందని ఆయన నేతగాళ్లను హెచ్చరించాడు. మిల్లు యజమానులు గొప్ప మానవతావాదులేమీ కాదు కాబట్టి చేనేత వస్త్రాలు వారి మిల్లు వస్త్రాల నాణ్యతకు దగ్గరగా వస్తున్నాయని భావించిన మరుక్షణం చేనేత పనివారి కంఠం చుట్టూ ఉచ్చు బిగించడానికి వెనుకాడరు. అందరూ నూలు వడకడం నేర్చుకొన్నట్లే అందరూ నేత నేయడం కూడా నేర్చుకుంటే చేతి నూలు వడకడంలో వున్న కష్టాల గురించి ఇంత సమస్య తలెత్తేది కాదు. ‘‘అందరినీ నూలు వడకమని చెప్పినట్లే అందరినీ నేత నేయమని చెప్పకపోవడం నా తప్పే’’అని ఆయన అంగీకరించారు.
నూలు వడికేవాడు
మిల్లు నూలుతోనే చేతిమగ్గంపై నేతపనిని గాంధీ నేర్చుకున్నాడు. కానీ ఇది స్వయం సమృద్ధికి దూరం కాబట్టి ఆయనకు సంతృప్తినివ్వలేదు. పత్తిని పండించడం మొదలు, పత్తి తీయడం, ఏకుల తయారీ, నూలు వడకడం, బట్టలు నేయడం వరకూ మొత్తం బట్టల తయారీలోనే నైపుణ్యం సాధించాలని ఆయన భావించాడు. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ కూనిరాగం తీసి ప్రస్తుతం మూలపడిన చరఖాకోసం ఆయన అనే్వషించాడు. ఒక మహిళ ఎక్కడో గ్రామంలోని ఇంట్లో పనిచేస్తూన్న చరఖాను ఒకదాన్ని కనిపెట్ట ఆ సంగతి గాంధీకి చెప్పింది. చరఖా వాడకంలో ఆశ్రమవాసలకు శిక్షణ ఇచ్చేందుకు ఆయన త్వరలోనే ఒక నూలు వడికే నిపుణుడిని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నపుడు రాట్నం వడుకుతున్న శబ్దం సంగీతంలా ఆయనకు సాంత్వన చేకూర్చేది. ఆయన త్వరలోనే రాట్నం వడకటం నేర్చుకున్నాడు. ప్రతిరోజూ ఒక అరగంట రాట్నం వడికితే కానీ భోజనం చేయకూడదని ఆయన వ్రతం తీసుకున్నాడు.నూలు వడకటమనేది ఆయనకు ఒక పవిత్ర కార్యం. ఆయన ఆ వ్రతాన్ని 30 ఏళ్ళపాటు అంటే మరణించేంతవరకు పాటించాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614