Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఉరకలను వేసెడుత్సాహమున్న చాలు
వేగవంతాన దూసుకుపోగవచ్చు
నిత్య చైతన్యముంజూప నిన్ను మించు
వాడు జగతినఁ గనరాడు ఱేడు వీవె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఉరకలేసే ఉత్సాహం మనస్వంతం అయితే అన్నింటా వేగవంతంగా మున్ముందుకు దూసుకుపోవచ్చు. నిత్యచైతన్యం కల్గియున్నపక్షంలో నిన్ను మించినవాడు మరొకడుండని నీవే రాజువన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియజెప్పుమా ప్రభూ!
తే.గీ. సుఖము మరగిన తదుపరి చూడఁ గషట
మన్నది పడలేమన్నట్టి మాట సత్య
మాదిలోఁ గష్ట పడవలె మానవాళి
పిదప సుఖపడవచ్చు వేమాటలేల?
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: సుఖాన్ని మరిగితే ఆ తరవాత ఏమాత్రం కష్టపడాల్సి ఉంది. ఆ తర్వాత ఎంతైనా సుఖపడవచ్చు. ఈ విషయంలోవేయి మాటలు అనవసరమన్న వాస్తవాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! లోకానికి ప్రబోధించవయ్య ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262