Others

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

79 శ్లోకం
దిశస్తు కకుభః కాష్టా ఆశాశ్చ హరిశ్చ తాః
ప్రాచ్యవాచీ ప్రతిశ్చత్యాః పూర్వ దక్షిణ పశ్చిమాః
ఉత్తరాదిగుదీచీ శ్యాదిశ్యమ్ తు త్రిషు దిగ్భవే॥
దిశః= దిక్కు, 4వ భాగం , కకూభః= దిక్కు, కాష్టా= 4వ భాగము, ఆశాః-4వ భాగము, హరితః= దిక్కు ఈ 5 దిక్కుల యొక్క వివిధమైన పేర్లు.
ప్రాచీ= తూర్పు భాగం, అవాచి= దక్షిణ భాగం, ప్రతీశ్చి= పశ్చిమ భాగం, పూర్వ = తూర్పు దిక్కు, దక్షిణ్= దక్షిణ దిక్కు, పశ్చిమ్= పడమర దిక్కు, ఊదిచి= ఉత్తర భాగం, ఉత్తర్= ఉత్తర దిక్కు, దిగ్భవే=దిక్ +్భవే= ఆయా దిక్కులందు లేక భాగముల యందు ఉత్పత్తి చేయుట లేక జన్మించుట; అవాచీనం అవాగ్భవ= దక్షిణ భాగమునందు కానీ దిక్కు నందు కానీ ఉత్పత్తి చేయుట లేక జన్మించుట ఊదీచీనం = ఉత్తర భాగమునందు కానీ దిక్కు నందుకానీ ఉత్పత్తి చేయుట, లేక జన్మించుట, ప్రతీచీ వామ్= ప్రాచీనామ్ ప్రతాగ్భవమ్ = పశ్చిమ భాగము, తూర్పు భాగము నదు కానీ దిక్కు నందుకానీ ఉత్పత్తి చేయుట, లేక జన్మించుట.

80 శ్లోకం
ఇన్ద్రో వహ్నినః పితృపతిర్నైరుతో వరుణో మరుత్
కుబేర ఈశః పతయః పూర్వ దీనామ్ దిశం క్రమాత్
భూమిని 4 సమాన భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగం తిరిగి 2 సమాన భాగముల విభజించి 8 సమాన భాగములుగా చేసి 8 ప్రాథమిక బిందువులు ఏర్పరిచి, ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క దేవతను పరిపాలకునిగా ఏర్పాటుచేయటమైనది, పూర్వాదీనం = గడియారం ముల్లు లాగా తూర్పు వైపు, దిశ= దిక్కులు, క్రమాత్= క్రమముగా, పతయః = దేవతలు, తూర్పు వైపు నుంచి గడియారము ముల్లు లాగా తిరుగుతూ ప్రాథమిక బిందువులకు ప్రాతినిథ్యం వహిస్తున్న దేవతలు, 1. తూర్పు= ఇంద్రుడు, 2. దక్షిణ= తూర్పు = వహ్ని= అగ్ని; దక్షిణ= పితృపతి= యముడు, దక్షిణ - పశ్చిమం = నైఋం = పార్వతి యొక్క రూపం, పశ్చిమం =వరుణః = వరుణుడు; ఉత్తర -పశ్చిమం= మరుత్ = వాయువు; ఉత్తరం = కుబేరః= కుబేరుడు , ఉత్తర - తూర్పు =ఈశ్వరుడు,
81 శ్లోకం
రవిః శుక్రో మహీసుమః స్వర్భానుర్భానుజో విధుః
బుధో బృహస్పతిశ్చతి దిశామ్ చైవ తథామ్ గ్రహాః
దిశం చైవ తథాగ్రహా= దిక్కులు, వాటిని ప్రాతినిథ్యం వహించే గ్రహములు తూర్పు వైపు రవి ; దక్షిణ - తూర్పు వైపు శుక్రుడు, మహీసునుః= మహీ+ సును= = సూర్యుడు, + పుత్రుడు= సూర్యుని పుత్రుడు యముడు,దక్షిణం వైపు యముడు, స్వర్ = ఆకాశంలో మంచివెలుగు ఉన్న బిందువు, రాహువు గ్రహం కాదు, ఆకాశంలో బిందువు,
ఇంకా ఉంది

తీగవరపు వనజ 7382762152