Others

మోనోపలీ నీచ సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిట్టలదొర, జై భజరంగభళి, ప్రేమపల్లకి, బ్యాచిలర్స్, సంపంగి, కుచ్చికుచ్చి కూనమ్మ లాంటి చిత్రాలు గురించి చెప్పగానే వెంటనే గుర్తొచ్చే దర్శకుడు సానా యాదిరెడ్డి. పరిశ్రమలో ఎవరివద్దా శిష్యరికం లేకుండా స్వీయ అవగాహనతో వచ్చిన వ్యక్తి. తొలి చిత్రం పిట్టలదొరతోనే పరిశ్రమను ఆకర్షించిన యాదిరెడ్డితో ఈవారం చిట్‌చాట్

నేపథ్యం?
-కరీంనగర్ జిల్లా గుళ్లకోట గ్రామం మాది. ఎంకామ్ ఎల్‌ఎల్‌బి చేసి పదిహేనేళ్లపాటు అడ్వకేటుగా ప్రాక్టీస్ చేశా. తర్వాతే దర్శకుడినయ్యా.

మొదటి చాన్స్ ఎలా?
-అనుకోకుండా అయ్యిందే. లైఫంతా ఛాలెంజ్‌లతోనే సాగింది. మంచి సినిమా చేయాలని నిర్మాతగా వచ్చి, దర్శకుడి అవతారం ఎత్తాను.

ఇష్టమైన జోనర్?
-ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌లో వుండే చిత్రాలు ఇష్టం.

ఇప్పుడంతా లవ్ హారర్‌లేగా..?
-ఇది సీజనల్ ట్రెండ్. ప్రేక్షకులు ఇలాంటివి చూసి చూసి కొత్తదనం కోరుకుంటారు. హిస్టారికల్, జానపదాలు, పౌరాణికాలు కూడా కచ్చితంగా తిరిగి వస్తాయి. లవ్ హారర్ చిత్రాలు ఎన్నాళ్లు చూస్తారు.

పరిశ్రమలో సమస్యలు?
-చిన్న సినిమా థియేటర్లు లేక చచ్చిపోయింది. ఇది దారుణం. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తెచ్చి పోరాడుతున్నాం. మినీ థియేటర్ల కానె్సప్ట్‌తో సీఎంకు వివరణ ఇచ్చాం. అవీ కబ్జాకాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. పరిశ్రమలోని మోనోపలీ నీచమైన సంస్కృతి.

నటీనటుల ఎంపిక ఎలా?
-నేను కథకే ప్రాధాన్యతనిస్తా. కథనుబట్టే నటీనటులను ఎంపిక చేస్తా.

దర్శకుడంటే?
-ఓ కథను సెల్యులాయిడ్‌పై అద్భుతమైన మెసెజ్‌లా అందించేవాడు. మార్గదర్శకంగా, పారదర్శకంగా అందరికన్నా ముందు ఆలోచించేవాడు.

-శేఖర్