Others

శ్రమనే గౌరవం తెస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తకిలీలను, చరఖాలను తయారు చేయడం వల్ల గ్రామీణ వడ్రంగం పనివారికి కమ్మరం పనివారికి ఉపాధి లభించింది. ప్రజలకు జీవనాన్నిచ్చేదిగా మహిళల గౌరవాన్ని కాపాడేదిగా ఆకలి కడుపులను నింపేదిగా చరఖా తిరిగి మారింది.
తర్వాత ఐదేళ్లలో ఖాధీ ఉత్పత్తి అమ్మకాలు పెరిగాయి. నూలు వడికేవారు లక్షమంది ఉపాధిని పొందారు. ఆసక్తి కలవారికి ఖాదీ తయారీలోని అన్ని దశల్లోను శిక్షణ ఇచ్చేవారు. ఈసూక్ష్మ కర్మాగారంతో పోటీ పడగలిగింది ఈ ప్రపంచంలో లేదు. చరఖా సంఘంలాగా అంత తక్కువ పెట్టుబడి, ఖర్చులతో 18 ఏళ్లల్లోనాలుగు కోట్ల రూపాయలను అవసరంలో ఉన్న లక్షలాది మందికి అందించిన మరో సంస్థను చూపండి అనేవాడు గాంధీ. నూలు వడకటం మీద కేవలం ఒక పైసా రెండు పైసలయ్యేది. నిదానంగా వారి దుస్తులను వారే సంపాదించుకొనే స్థితికి ఎదిగారు.
తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన నూలును ఇచ్చే చరఖా తయారు చేసిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు. తుది మెరుగులు దిద్దాడు. అది ఎర్రవాడ చరఖాగా ప్రసిద్ధి పొందింది. నూలు వడికే మరోక సరళమైన చవకైన పరికరమైన ధనుష్ తకిలిని గాంధీ తర్వాతి కాలంలో ప్రాచుర్యంలోకి తీచ్చాడు. ఆయన దానితో చరఖా అంత వేగంగా అంతే నాణ్యమైన దారాన్ని ఉత్పత్తి చేయగలిగాడు. ఆయన తకిలీతో కూడా నూలు వడికేవాడు. ఆ దారం అంత సన్నగా ఉండేది కాదు. కానీ బాగా పురిపెట్టబడి సమాన మందంతో ఉండేది. ఆయన తాను వడికిన నూలుతో తయారు చేసిన చీరలు నేసి వాటిని కస్తూర్బాకు బహుమతిగా ఇచ్చేవాడు. కస్తూర్బా కూడా క్రమం తప్పకుండా రాట్నం వడికేది.
రాట్నం వల్ల నూలు వడికేవారికి రోజుకు ఒకటి, రెండు అణాలకంటే ఎక్కువ ఆదాయం రాదని ఎవరో అన్నారు. భారతదేశంలో సగటు తలసరి ఆదాయం రోజుకు గట్టిగా మూడు పైసలు కూడా లేదు. నేను చరఖాతో దానికి అదనంగా మరో మూడుపైసలు కలపగలిగినా రాట్నాన్ని భారతదేశానికే సమృద్ధిని ఇచ్చే ఆవు అనడంలో తప్పులేదు కదా. అని జవాబిచ్చాడు.
గంటకు రెండు పైసల హీనమైన ఆదాయం కోసం రోజూ పదిమైళ్లు నడిచి వచ్చే మహిళల కోసం నూలు వడికేవారి కోసం ఒక గౌరవ ప్రదమైన వేతనాన్ని ఏర్పాటు చేయాలని గాంధీ పట్టుబట్టారు. ఆ తర్వాత రోజుకు మూడు అణాల కనీస వేతనాన్ని స్థిరపరిచారు.
గాంధీ చరఖా విలువను కేవలం డబ్బుతోనే కొలవలేదు. అది ప్రజలలో పెంపొందించగల బలాన్ని కూడా లెక్కించాడు. చరఖా ప్రజలను వ్యవస్థీకృతం చేస్తుంది. ఒకరితో మరొకరికి సంబంధాలు పెంచి ఒకరికొకరు బంధువులం అనిపించేలా చేస్తుంది. అది శ్రమ శక్తకి ఉన్న గౌరవాన్ని గుర్తిస్తుంది. మానవత్వానికీ, శాంతికీ, స్వాతంత్య్రానికీ, సేవకూ ప్రతీకగా నిలుస్తుంది. అది చవకగా సరళమైన పదార్థాలతో రూపొందించబడింది. చేతి నైపుణ్యాలకు పదును పెడుతుంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యేకత సాధించిన ఇంజనీర్లు కానీ, దీన్నుపయోగించటం నేర్వడానికి ప్రత్యేక నైపుణ్యం గల ఉపాధ్యాయులు కానీ అవసరం లేదు. ఈ అందమైన చేతికళను గుడిసెలో బలహీనులు, ముసలి వాళ్లు ఐదేళ్ల బాలబాలికలు కూడా సాధన చేయవచ్చు.
చరఖా అంత గొప్పదే. అయితే ప్రాచీన కాలంలో యంత్రమూ ఉత్పత్తి చేయలేనంత సన్నని నాణ్యమైన నూలు ఉత్పత్తి చేసి, తమ అవసరాలకు తీర్చుకోవడమే కాక దూర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయగలిగిన భారతీయులు పేదరికంలోకి బానిసత్వంలోకి ఎందుకు పడిపోయారని ఒక విమర్శకుడు అడిగాడు.
ప్రాచీనకాలంలో చరఖాకు స్వాతంత్య్రానికి ఎటువంటి సంబంధమూలేదు. పైగా దానికి బానిసత్వపు నేపథ్యం కూడా ఉంది. అపుడు పేద మహిళలు వారికి అప్పటి ప్రభుత్వం ఇచ్చే గుప్పెడు తిండికోసం ఒక రొట్టెముక్క కోసం రాట్నం వడికేవారు అని గాంధీ జవాబు ఇచ్చారు. మనం తెలివిగా రాట్నాన్ని వాడాలి. నూలు వడకడానికి సంబంధించిన ప్రతి చిన్న వివరం మీద మనకు శాస్ర్తియ అవగాహన ఉండాలి. జీవం లేకుండా రాట్నాన్ని తిప్పటం ఊరికే జపమాలను తిప్పడం లాంటిదే.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614