Others

అంతేమరి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిలబడే వరకూ సౌత్ సినిమాలు, పరుగొచ్చాక బాలీవుడ్ సినిమాలు -స్టార్ హీరోయిన్లకు అలవాటే. ఇదే బాటలో శృతిహాసన్ కూడా పరిగెత్తినా -బాలీవుడ్ కలిసిరాకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిందట. నిజానికి శృతికి తెలుగులో అవకాశాలు తక్కువేం కాదు. కాకపోతే -పరిభాషా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో టాలీవుడ్‌కు కాస్త దూరమైంది. ఇప్పుడు -అక్కడ చాన్స్‌లు లేకపోవడంతో మళ్లీ వీరవిహారం చేసెయ్యడానికి వస్తోందట. ఇప్పటికే ‘ప్రేమమ్’ విడుదల కావాల్సి ఉంది. పవన్ కల్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’ చేయనుంది. ఇక తమిళంలో సూర్య-3, శభాష్ కుండు చిత్రాలకు సంతకాలు చేసేసింది. ఈ రెండూ తెలుగులోకి అనువాదమయ్యే చిత్రాలే. ఇవికాకుండా మరికొన్ని సబ్జెక్టులు వింటున్నాననీ చెప్తోంది. సక్సెస్‌ఫుల్ లెగ్ కనుక -శృతిని కాదనేవాళ్లెవరు?