Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం
- సాంధ్య శ్రీ 8106897404
*

9
ఆత్మగర్భాన వర్తమాన శిశువునై ఎదిగే నేను
అంతకుముందు ఏ ప్రవాహ బిందువునైనానో
ఏ చిరంతన శక్తి ప్రేరేపిస్తే కర్తవ్యోన్ముఖుడ్ని అయ్యానో
అక్షరమైనప్పుడే
ఆకాశ నీలినయ్యాను మరుదంకురమైనప్పుడే
మార్తాండ మరీచినయ్యాను
అంబుద కణాన్నైనప్పుడే
అవనీతల రేణువునయ్యాను
అయినా
నేను ఎక్కడున్నానని వెతుకుతుందీ లోకం...
రెక్కలై రేకులు విప్పుకుంటున్న పూవుమీద
పద్యాక్షర వర్ణతారళ్యంతో
ఎగురుతున్న సీతాకోక చిలుకనై
సద్యో నిర్గతమైన నాద సంచారాన్ని
స్వరాలతో కానుక పెట్టే గంధర్వ
క్షణాల ఔదార్యాన్ని దిగంత పరివ్యాప్త గీతంగా
కోకిల గొంలోకి ఒదిగిపోయినా
ఎక్కడున్నానని వెతుకుతుందీ లోకం
శబ్ద ఝంఝ శతాబ్దాల పర్వతాల్ని భాషాంబుదాలతో
పెనవేసుకున్న శుభ ఘడియనై
భూగోళంమీద వర్షిస్తున్న ఆకాశ బారిమనై
ప్రహిత పాంచజన్యాన్ని పూరిస్తున్నాను
అయినా ఎక్కడున్నానని వెతుకుతుందీ లోకం...
ఉన్నదిఒక్కటే పరబ్రహ్మం

చరవాణి: 9490620512