Others

జ్ఞానమే పరిణామానికి దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానివెనుక ఉన్న ఉద్దేశం తెలుసుకోనప్పుడు ఒట్టి యాంత్రిక వినియోగం వల్ల ఎలాంటి ఉపయోగమూలేదు అని ఆయన వివరించాడు.
సేవకు చరఖా ఒక సాధనం. మీరునేర్పే వడ్రంగం, మట్టి బొమ్మల తయారీ రంగులు వేయడం లాంటి వృత్తుల లాంటి ది కాదు. అని ఆయన ఉపాధ్యాయులకు చెప్పేవాడు. అభివృద్ధి చెందాలని ఆయన భావించేవాడు.
నూలు చుట్టులను లెక్కించడం ద్వారా విద్యార్థులలకు అంకగణితం నేర్వవచ్చు. పతితపంట మొట్టమొదట ఎక్కడ పండించారు. దాన్ని పండించడానికి ఎలాంటి నేల కావాలి.వివిధ దేశాల మధ్య పత్తి వాణిజ్య ఎగుమతులూ దిగుమతులూ అభివృద్ధిచెందడంలో దశలేవి ఇలాంటి వాటి ద్వారా విద్యార్థులకు చరిత్ర భూగోళం అపకృతి శాస్త్రం బోధించవచ్చు. తకిలీ వాడకం ద్వారా విద్యార్థులకు ఇప్పుడు తకిలీ ఇరుసు ఉక్కుతో ఎందుకు చేస్తున్నారు. తకిలీ ఇత్తడి బిళ్ల నిర్ధిష్టమైన వ్యాసంతో ఎందుకు చేస్తారు. లాంటి వాటి ద్వారా లెక్కలు, తదితర విషయాలు నేర్వవచ్చు. చరఖాతో కలిపి నిర్వహిస్తేనే తన పుట్టినరోజు వేడుకలను జాతీయ స్థాయిలో జరుపుకునేందుకు గాంధీ అంగీకరించాడు. ఖాదీని రాటం వడకటాన్ని ప్రచారం చేయడానికి లభించిన ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదులుకునేవాడు కాదు. ఆయన కాంగ్రెస్ అద్యక్షుడు అయినపుడు కాంగ్రెస్ సభ్యత్వానికి చెల్లించాల్సిన నాలుగజాల చందా బదులు ఖాదీ ప్రాతినిద్యం తీసుకోవాలని ఆయన సూచించాడు. రోజూ అరగంట పాటు రాట్నం వడికి, నెలకు నిర్ధిష్ట మొత్తంలో నూలును ఖాదీ బోర్డుకు పంపాలి. ఖాదీ బోర్టు వద్ద ఖద్దరు కొనేందుకు వచ్చేవారంతా తాము స్వయంగా వడికిన నూలును కనీస మొత్తంలో అయినా తేవాలనే నిబంధన పెట్టమని ఆయన చివరిరోజులో చరఖాసంఘానికి సూచించాడు. మేం నూలును తయారు చేయలేమని ప్రజలు గొణుక్కున్నపుడు ఎవరూ నూలు వడకకపోతే ఖాదీ ఎక్కడ నుంచి వస్తుంది అని గాంధీ ప్రశ్నించాడు.
భారతదేశంలో బట్టల కరువు వస్తుందనే మాటనే ఆయన కొట్టి పారేసేవాడు. భారతదేశం తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ పత్తిని ఉత్పత్తి చేస్తోందని మనకు భారీగా మానవ వనరులున్నాయనీ ఆయన విశ్వసించాడు. నూలు వడకటం క్రమ క్రమంగా ఆయన మానసిక అవసరమై పోయింది. తాను రాట్నం ద్వారా నిరుపేదలకు వారి ద్వారా దేవుడికి దగ్గర అవుతున్నాని ఆయన భావించేవాడు. చరఖా మీద నాకున్న మోజు పోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. మీరు నన్ను వెలివేసినా, చంపినా నేను చరఖాను వదలను అని ఆయన ధ్రువీకరించాడు కూడా.
వ్యాపారి
‘‘నేను వైశ్యుడిని, నా లోభానికి పరిమితిలేదు’’ అని గాంధీ ఒక సందర్భంలో అన్నాడు. ఆయనది వైశ్యకులం. తండ్రి చేసిన దివాన్ పదవికి వారసుడిగా పెరిగాడు. కానీ ఎప్పుడూ దివాన్‌గా పనిచేయలేదు. జీవితమంతా భిక్షకునిగా గడపాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆయన రక్తంలో వున్న వైశ్య లక్షణాలు ఆయన్ను వదలలేదు.
ఆయన చాలా పొదుపుగా ఉండేవాడు. చవకగా, నాణ్యంగా అందంగా ఉండే వస్తువులను తేలికగా పసిగట్టేవాడు. అన్నిసౌఖ్యాలను, షోకులను వదలి స్వయంగా తయారుచేసుకున్న ఖాదీ వస్త్రం, ముతక దుప్పటి, నాటు తోలు చెప్పులు ధరించడం ప్రారంభించాడు. తన భార్యా పిల్లలు కూడా నిరాడంబరమైన ముతక ఖాదీ బట్టలు ధరించేలా చేశాడు. గాంధీ ఎప్పుడూ విందు భోజనం చేసేవాడు కాదు. ఒకటి రెండు కాల్చిన రొట్టెలు, అన్నం, ఉడికించిన కూరగాయలు, పచ్చికూరలు, మేకపాలు, బెల్లం, తేనె, పళ్లు ఆయన ఆహారంలో భాగం. ఆయన రోజుకు అయిదు రకాల ఆహారంకన్నా ఎక్కువ తీసుకొనేవాడు కాదు. ఒక పేదవాడు రోజుకు అణా మాత్రమే సంపాదించుకొనే దేశంలో, అలంకార వస్తువులు, నగల రూపంలో వేలాది రూపాయలను వృధాగా నిల్వ చేయడం నేరమని గాంధీ విశ్వాసం.
ఆయన తన నలుగురు కొడుకులను భారతదేశంలోని కోట్లాదిమంది పేదలకు అందుబాటులో లేని ఖరీదైన పాఠశాలలు, కళాశాలలకు పంపలేదు. ఆయనే వారికి గురువయ్యాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614