Others

అసూయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు ప్రపంచంలో అన్ని అనర్థాలకూ ముఖ్యకారణం ఏమిటి? అసూయ! పక్కవాడు పచ్చగా ఉంటే చూసి ఓర్చలేడు. అవతలివాడు ఆనందంగా ఉంటే అది చూసి సహించలేడు. ఇంకొకరిని నలుగురూ మెచ్చుకుంటే విని భరించలేడు. ఏదో ఒక రకంగా వాడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తాడు. ఇదీ లోకం రీతిగా కలియుగంలో మారిపోయంది. అందుకే ఎక్కడ చూసినా అమానుషాలు, అక్రమాలు, అసహజ మరణాలు సంభవిస్తు న్నాయ. అంతేకాక అసహనం చాలామందిలో ఎక్కువ అయంది. అసూయ, అజ్ఞానం, స్వార్థం, మనిషిని పక్కదారి పట్టిస్తాయి. పతనాన్ని కల్గిస్తాయి ఇట్లాంటి వాటిని దూరం చేసుకోవాలంటే భ్గవంతునిపైన భక్తిని పెంచుకోవాలి. సేవాభావాన్ని పెంపొందించు కోవాలి. మానవత్వాన్ని వెలికితీయాలి. మన పూర్వజులు నడచిన బాటలో మనమూ నడవాలి. సత్యానే్న పలకాలి. ధర్మానే్న ఆచరించాలి.