Others

భారత్‌కు నవోదయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాలు ముగిసాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల (బ్రిక్స్) వార్షిక సదస్సు బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో ఇటీవల ముగిసింది. ఇందులో భాగంగా జరిగిన బిజినెస్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రపంచంలోనే పెట్టుబడులకు భారతదేశం ఎంతో అనుకూలమైనదని, పెట్టుబడిదారులకు స్నేహహస్తం అందిస్తోందని చెప్పారు. భారత్‌లో అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వ్యవహారాలన్నీ పారదర్శకంగా కొనసాగుతున్నాయని వివరిస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
అక్కడే మరో వేదికపై మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే తత్త్వం పెరగాలని, ఒకరి వద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉంటే, మరొకరి దగ్గర ముడిసరుకు వుంది. ఇంకొకరి వద్ద మార్కెట్ వుంది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుని ఉపయోగించుకుని అభివృద్ధి దిశగా పయనించాలని పిలుపునిచ్చారు.
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా మోదీ ‘అభివృద్ధి’కి అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. అభివృద్ధి జరిగినపుడే పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానం కీలకమని పలు వేదికలపై ఆయన గుర్తుచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచి, పేదరికం తొలగించేందుకు అవసరమైన రూట్‌మ్యాప్ ఆయన మదిలో స్పష్టంగా వుంది. అందుకు అనుగుణంగానే ఆయన కదలికలు, మాటలున్నాయి. బ్రిక్స్ వేదికపై ప్రసంగించినా, కొన్ని వారాల క్రితం సౌదీ అరేబియాలో జరిగిన ‘ఎడారి దావోస్’ సదస్సులో మాట్లాడినా మోదీ భారతదేశంలోకి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వౌలిక సదుపాయాల విస్తృతిపై విస్తృతంగా మాట్లాడి ప్రోత్సహిస్తున్నారు. అందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
అలాగే ప్రపంచ శాంతి- సౌభాగ్యానికి ఉగ్రవాదం పెను ప్రమాదంగా మారిందని, ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ఇటు బ్రిక్స్ సదస్సులోనూ, అటు సౌదీ అరేబియా ఎడారి దావోస్ సదస్సులోనూ ప్రధాని హెచ్చరించారు.
వాస్తవానికి ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి అపారమైన నష్టం కలుగజేస్తున్నాయి. ఈ విషయాన్ని మోదీ తొలి నుంచి ఓ స్పష్టమైన వైఖరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉగ్రవాదం ప్రజలకు ఎంతో నష్టం చేకూర్చిందని, వ్యాపారం -వాణిజ్యం దెబ్బతిన్నదని, అభివృద్ధి చెందుతున్న దేశాల పాలిట ఉగ్రవాదం శాపంలా పరిణమించిందని ఆయన పదే పదే చెబుతున్నారు. బ్రిక్స్ ప్లీనరీ సమావేశాల్లో మోదీ ఈ విషయాన్ని ఆయా దేశాధినేతల దృష్టికి మరోసారి తీసుకొచ్చారు. టెర్రరిజం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక సమాజాలు అతలాకుతలమయ్యాయని, బీతావహ వాతావరణం వల్ల, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, ఆ ముసుగులో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని మోదీ గుర్తుచేశారు. ‘వినూత్న భవిష్యత్ ఆవిష్కరణ కోసం ఆర్థిక వృద్ధి’ అన్న అంశమే బ్రిక్స్ సదస్సు ప్రధాన ఎజెండాగా కొనసాగింది. ఇందులో డిజిటల్ ఎకానమీపై సమన్వయం- సహకారం అవసరమని గుర్తించారు. ప్రపంచ జనాభాలో 42 శాతం ప్రజలు బ్రిక్స్ దేశాల్లో ఉన్నారు. అలాగే ప్రపంచ జిడిపిలో 23 శాతం ఇక్కడే కనిపిస్తోంది. ఇక వాణిజ్యం 17 శాతం ఉందని గుర్తించిన నాయకులు ఆర్థిక అభివృద్ధిపై ఆలోచనలు పంచుకున్నారు. అంటే ఇప్పుడు అంతటా ఆర్థికాభివృద్ధిపైనే మనసు నిలుపుతున్నారు. మోదీ నాలుగడుగులు ముందుండి భారతదేశ ఆర్థికాభివృద్ధి గూర్చి ఆలోచిస్తున్న విషయం ఆయన ప్రతి మాటలో స్పష్టంగా తెలుస్తోంది.
వచ్చే ఐదేళ్ళలో భారత ఆర్థిక వ్యవస్థ ఇది ట్రిలియన్లకు చేరుకోవాలని ఆయన శ్రమిస్తున్నారు. ప్రతి అడుగు అందుకు అనుగుణంగా వేస్తున్నారు. దేశం నుంచి పేదరికాన్ని తొలగించాలంటే ఆర్థికాభివృద్ధి ఒక్కటే మార్గమని, అందుకు ఉబికి వచ్చిన వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలని ఆయన ప్రతిసారి వివరిస్తూనే ఉన్నారు. ఈ ఉజ్వల ‘విజన్’కు అనుగుణంగానే మోదీ విదేశీ పర్యటనలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో పర్యటించినా, యుఏఈలో పర్యటించినా ఆయా దేశాల పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అలాగే భారత్ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఇదే కదా ఇప్పుడు కావలసింది! విదేశాల్లోనే కాదు దేశంలోనూ సానుకూల పరిస్థితులు గతంలో కన్నా మెరుగవడం గమనార్హం.
అయోధ్యపై తీర్పు
జర్మన్ దేశాన్ని చీల్చిన బెర్లిన్ గోడ కూలి మూడు దశాబ్దాలయింది. ఉభయ జర్మనీల పునరేకీకరణ 1989న నవంబర్ 9న జరిగింది. యాదృచ్ఛికంగా అదే రోజు భారతదేశంలో చారిత్రాత్మకమైన ‘అయోధ్య తీర్పు’ను సుప్రీంకోర్టు వెలువరించింది. దాంతో ఉభయ ధర్మాల (మతాల)మధ్య నెలకొన్న వైరిభావం సడలి సఖ్యత.. సద్భావం చిగురించింది. అనూహ్యంగా అదే రోజు భారత-పాకిస్తాన్‌లమధ్య ‘కర్తార్‌పూర్ కారిడార్’ ప్రారంభం కావడంతో రెండు దేశాలమధ్య గల ‘ఉద్రిక్తత’ కొంత సడలింది. సంతోషకర వాతవారణం ఇరువైపులా కనిపించింది. ఇవి మధురమైన భావననలుగా మిగిలిపోతాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. తన మదిలోని దేశ ఉజ్వల భవిష్యత్ స్వప్నం మరోసారి ప్రజల ముందు ఆవిష్కరించారు.
భారత రాజ్యాంగం - న్యాయవ్యవస్థపై విశ్వాసముంచి ప్రజలందరూ ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసంతో దేశ భవిష్యత్ కోసం పౌరులందరూ మరింత బాధ్యతతో ముందడుగు వేయాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలోని ‘శక్తి’ని ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు. అనాదిగా వస్తున్న భారతీయ విలువలతో ముందుకు సాగాలని, సకారాత్మక వైఖరితో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. నూతన భారతదేశమే లక్ష్యంగా కదం తొక్కాలని, ఒకే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని, ఇపుడు ఆ బాధ్యత మరింత పెరిగిందని ప్రధాని ప్రజలకు గుర్తుచేశారు.
తాజాగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మోదీ సర్కారుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్‌నిచ్చింది. దేశానికి శక్తిమంతమైన యుద్ధ విమానాల రాక త్వరలో ప్రారంభమవనుంది. గత దసరా సందర్భంలో రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ ఫ్రాన్స్ వెళ్లి రాఫెల్ యుద్ధ విమానానికి పూజ చేసిన సంగతి తెలిసిందే! దాయాదిదేశం అణుయుద్ధం అంటూ ఆవేశపడి హంగామా సృష్టించినపుడల్లా ప్రజలు ఇక హైరానా పడనవసరం లేకుండా అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు పంజాబ్ సరిహద్దులో కొలువుదీరనున్నాయి. దేశ భద్రతకు ఎలాంటి ఢోకాలేదని జరుగుతున్న అనేక పరిణామాలు తెలుపుతున్నాయి. అలాగే కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం కనబడుతోంది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఉనికిలోకి వచ్చాక దేశ సమైక్యత, శక్తి మరింత చిక్కబడింది.
ప్రపంచంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా, భారతదేశ వృద్ధి రేటు అనేక దేశాలకన్నా ఎంతో మెరుగ్గా వుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మోదీకి జాతీయంగా, అంతర్జాతీయంగా అన్నీ సానుకూలతలే కనిపిస్తున్నాయి. దాంతో దేశానికి ‘ప్రధాన సేవకుడి’గా మరింత నిష్టతో ముందుకు సాగేందుకు అవకాశం లభించింది. ఇకపై భారత్‌కు శోభోదయం.. నవోదయమే!

-వుప్పల నరసింహం 9985781799