Others
అమరత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 November 2019
- కోడిగూటి తిరుపతి, 9573929493

అదిగో
ఆ కటిక శిలను
సజీవ శిల్పంగా చెక్కిందెవరు
ఆ కణుపుల వెదురును
సప్తస్వర మురళిగా
మలిచిందెవరు?
ఆ నూలు పోగుల
సుందర వస్త్రంగా
అల్లిందెవరు?
ఆ కఱ్ఱదుంగను
అందాల బొమ్మగా
రూపమిచ్చిందెవరు?
ఆ బురదమట్టిని
దాహార్తిని తీర్చు పాత్రగా
తీర్చిదిద్దిందెవరు?
ఆ ఇనుమును
మానవ పనిముట్టుగా
మార్చిందెవరు?
ఆ జంతు చర్మాన్ని
పాదరక్షలుగా
చేసిందెవరు?
ఇన్ని అద్భుతాలకు మూలం మనిషే కదా!
మరి అదే మనిషి
మానవత్వానికి ‘అమరత్వం’
అద్దితే ఎంత బాగుండు!