Others
సిగ్గుపడుతున్న మట్టి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 November 2019
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 9440233261
నిజానికి కొందరికి
దుఃఖం విడిగా రాదు
సుఖాల వెంపర్లాటలో
అదృశ్యంగా వెంటాడుతది
లక్షల కోట్లు వెనకేసుకున్న వాడికి
సుఖమెప్పుడూ ఎండమావే
పరుగెత్తినంతకాలం
జైళ్ళు నోళ్ళు తెరుస్తాయ
బుకాయంపుల వెనక
చిదంబర రహస్యాలేముంటాయ?
తప్పించుకునే యత్నంలో
దింపుడు కల్లం ఆశలే!
చరిత్ర పాఠాలను
ఎవరూ చెవికెక్కించుకోరు
రాజ్యాధికారాన్ని దానంచేసిన వాడిమీద
మూడోపాదం మోపక మానరు!
అన్యాయానికున్న ఆత్రం
న్యాయదేవతకుండదు
అదను చూసి కాని
శిక్షలు ఖరారు చేయదు
కూలిన రాజ్యాలు
శిథిలమైన రాజసౌధాలూ
జనకంటక దుర్మార్గాలకు
చెరిగిపోని సాక్ష్యాలు
మలినమంటిన చేతులతో
జాతి పతాకాన్ని ఎగురవేసినందుకు
మోసపోయన ఈ దేశపు మట్టి
మిమ్మల్ని కన్నందుకు సిగ్గుపడుతున్నది!