Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13
ఉదయం సూర్యుడు కడిగిన పగడమై
ఆకాశ నగరాలమీద కిరణాలు గర్జిస్తాడు
ముసుగు తన్నిన రాత్రిని మేల్కొలపటమంటే
కష్టాలమీది మూత తీయటం కాదు..
తలపుల్ని తడిపిన స్వప్నధారల్లోంచి తీసి
మెలకువ నద్దుతాడు మందసానుడు..
స్పందన పొందిన తరుణారుణ స్వరాన్ని
తేనెలాంటి సంధ్యలో మిళితం చేసి
బరువులు మోసేవాడి ఊపిరికందిస్తాడు...
నిండు కలల జగత్తును నిద్రలేపటం
అవ్యక్తాత్మల్ని సమస్త మూల ద్రవ్యాన్ని
ఎండల పాండిత్య ప్రతిభకు అర్పించి
ఏరువాక పట్టం కట్టి జీవితపు రంగుల్లో తడిసి ముద్దవటం
ఎందరికి తెలుసునని...?
నిశ్శబ్ద ప్రతీకలతో నైసర్గికమంతా
కవితామయమైపోతుంటే
మానవ రక్తం గొంతెత్తి ఋతువుల గీతాన్నాలపిస్తోంది
ఎవరి అశ్రువులు కళ్ళను విడిచి
కవిత్వంలోకి ప్రవేశిస్తాయో అక్కడ పుట్టిన భూకంపం
నా అరచేతిలో ప్రత్యక్షమయింది
సాయంత్రానికి సూర్యుడు కొండ వెలిగించిన దీపమై
నక్షత్రాల్లో తుపలకరిస్తాడు...

ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404