Others

స్ట్రెచ్‌మార్క్స్ తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల్లో స్ట్రెచ్‌మార్క్స్ అతి పెద్ద సమస్య. సాధారణంగా ప్రసవం తరువాత చాలామంది మహిళలకు స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడతాయి. చర్మపు చారలు ముఖ్యంగా కడుపుపై, భుజాల దగ్గర, కాళ్ళ పైభాగంలో ఏర్పడతాయి. ఇవి ఏర్పడటానికి ప్రసవం ముఖ్య కారణం కాగా, తొందర తొందరగా బరువు తగ్గడం, వేగంగా ఎదుగుదల, ఒత్తిడి వంటివి కూడా కారణాలు కావచ్చు. వీటిని తగ్గించుకోవడానికి రసాయనాలతో క్రీములను వాడటం కన్నా సులువుగా ఇంట్లో వాడే పదార్థాలతోనే పూర్తిగా తగ్గించుకోవచ్చు.
* సహజంగా చర్మపు చారలు తగ్గించే పదార్థాల్లో పంచదార ఒకటి. పంచదారను ఆల్మండ్ ఆయిల్‌తో కలిపి వాడితే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ముందుగా పంచదారను తీసుకుని అందులో కొద్దిగా ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. పంచదార పూర్తిగా కరిగాక స్ట్రెచ్‌మార్క్స్‌పై పూయాలి. ఆ భాగాన్ని సున్నితంగా కాసేపు మర్దనా చేయాలి. కాసేపటి తరువాత ఆ ప్రదేశాన్ని కడగడం కానీ స్నానం చేయడం కానీ చేయాలి. ఇలా ప్రతిరోజూ ఒక నెల పాటు చేస్తే చర్మపు చారలు దాదాపు కనిపించకుండా పోతాయి.
* చర్మ సమస్యలను నిర్మూలించడంలో, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో అలోవెర కంటే మించింది మరోటి లేదు అనడం అతిశయోక్తి కాదు. వీటిలోని సహజ గుణాలు స్ట్రెచ్ మార్క్స్‌ని పూర్తిగా నిర్మూలించగలవు. సహజంగా దొరికే అలోవెరా గుజ్జు కానీ మార్కెట్లో దొరికే అలోవెరా జెల్‌ని కానీ చారలపై పూసి మృదువుగా మర్దనా చేయాలి. పదిహేను నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
* పావు కప్పు అలోవెరా జెల్లో విటమిన్ ‘ఇ’ క్యాప్సూల్స్, విటమిన్ ‘ఎ’ క్యాప్సూల్స్‌లోని నూనె వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చారలకు పూసి ఆరేంత వరకు వేచి ఉండాలి. కాసేపటి తరువాత స్నానం చేయాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి.
* బంగాళాదుంపల్లో విటమిన్ సి, పొటాషియం, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు చర్మ కణాలను వేగంగా ఉత్తేజ పరుస్తాయి. కాబట్టి ఇవి చర్మానికి మంచిది. బంగాళాదుంపని మందపాటి ముక్కలుగా కోయండి. ఒక ముక్కను తీసుకుని చారలపై రుద్దాలి. తడి ఆరే వరకు ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
* స్ట్రెచ్‌మార్క్స్ తగ్గించడానికి మరొక సులువైన మార్గం నిమ్మరసం. నిమ్మరసం మొటిమలను కూడా తగ్గిస్తుంది. నిమ్మరసాన్ని చారలపై పూసి కాసేపు మర్దనా చేసి కడిగేయాలి. ఇలా రోజూ చేయడం ద్వారా చారలు అతి తక్కువ కాలంలోనే తగ్గిపోతాయి.
* నిమ్మరసంలో కొద్దిగా కీరారసంతో కలిపి వాడితే మరింత ప్రయోజనంగా ఉంటుంది.
* గుడ్డులోని తెల్లసొన చర్మానికి చాలా మంచిది. వీటిలో చర్మకాంతికి ఉపయోగపడే అమినో యాసిడ్స్, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి చారలు తగ్గించడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముందుగా చారలు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటిపై తెల్లసొన రాయాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత కొంచెం ఆలివ్ ఆయిల్ దానిపై రాయాలి. పదిహేను నిముషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే రెండు వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది.
*