Others

అనుకరణ పతనం చేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బ్రిటిషు వారి శైలిని, వారి అలవాట్లను అనుకరించడం మనల్ని నాశనం చేయడమేకాక, భారతదేశాన్ని కూడా పతనం చేస్తుందని’’ ఆయన హెచ్చరించాడు. తమ ఖరీదైన అలవాట్లతో పాలిత దేశంలో ఒక విభ్రమ సృష్టించాలని బ్రిటీషువారు భావించారు. మనం ఆ ఖరీదైన అలవాట్లను విడిచిపెట్టేయాలి. చేత్తో తయారుచేసిన కాగితంమీద హిందీ, ఉర్దూలలో సాధారణంగా ముద్రించిన లెటర్‌హెడ్‌లను వాడాలి. ప్రజాసేవకులు ఆడంబరమైన స్వాగతాలను, సత్కారాలను స్వీకరించకూడదు’’.
పేదల కోసం సమీకరించిన సొమ్ములో ప్రతి పైసా పొదుపు చేయాలని గాంధీ ప్రయత్నించేవాడు సామాజిక నిధుల కోసం ఆయనకు వచ్చిన మనీయార్డర్లు , చెక్కులు, డ్రాప్టులపై కమీషన్ పొదుపు చేయాలనీ ప్రయత్నం చేసేవాడు. ప్రజా విరాళాలతో దుబారా చేసే కార్యకర్తలు, నిర్వాహకులను మందలించేవారు.1896 లో గాంధీ దక్షిణాఫ్రికానుంచి భారతదేశానికి వచ్చినపుడు అక్కడి భారతీయ సంఘం వారు ఆయన ఖర్చులకు అప్పగించాడు. ట్రాముకు 1 అణా, మంచినీళ్లకు 6 పైసలు, గారడీవారు 6 పైసలు , మెజీషియన్ 6 అణాలు, థియేటర్ 4 రూపాయలు - ఇలా ఉండేది ఆ లెక్క .
‘‘మన ప్రచారంలో ఆడంబరాలకు, దుబారాకు చోటు లేదు. స్థానిక కార్యకర్తలు నా కోసం బాగా ఖరీదై న పళ్లు తెస్తే లేదా నాకు 12 పళ్లు కావాల్సిన చోట 100 పండ్లు తెస్తే మనం సామాన్య భారతీయుల ప్రతినిథులుగా ఉంటామని చెప్పుకునే దానికి అర్థమేముంది? అది చాలా అపార్థాలకు దారితీస్తుంది. ఇమనం ఆచరణలో నిజంగా పేదలకు అపతినిథులుగా ఉండాలి. ’’అని గాంధీ గారు తరుచుగా చెప్పేవాడు. ‘‘నీకు నడిచే శక్తి ఉంటే వాహనం ఎక్కకు’’ అని ఆయన సూచించేవారు. ఆయన యువకుడిగా ఉన్నరోజులలో దీన్ని స్వయంగా ఆచరించేవాడు. దానివల్ల ఆయన పొదుపు చేసేది కొన్ని రూపాయలే అయినా ఆయన దక్షిణాఫ్రికా లో ఉండగా ఒక దుకాణం నుంచి సరుకులు తెచ్చుకునేందుకు రోజుకు 42 మైళ్లు నడిచి వెళ్లి, వచ్చేవాడు. రోజూ తన కార్యాలయానికి, కోర్టుకి కూడా నడిచి వెళ్లి వచ్చేవాడు గాంధీ.
ఒకసారి ‘‘జాతీయతావాదానికి జాతి విద్వేషం అవసరమా’’ అనే ఆయన ఉపన్యాసం వినడానికి టికెటు పెట్టారు. అలావసూలు చేసిన సొమ్మును దేశబంధు మెమోరియల్ నిధికి సమర్పించారు. గాంధీ మొదటిసారిగ సత్యమే దేవుడు అనే ఉపన్యాసాన్ని ఒక గ్రామ్ ఫోన్ కంపెనీ కోసం రికార్డు చేశాడు. ఒక అరగంటలో ఆయన 65, 000 రూపాయలు సంపాదించి దాన్ని హరిజన నిధికి విరాళమిచ్చాడు. ఆయన డబ్బు పొదుపు చేయడమేకాదు సంపాదించడమూ వచ్చు. ప్రభుత్వం ఆయన పుస్తకాలను నిషేధించినపుడు ఆయన వాటిని బహిరంగంగా అమ్మాడు. హింద్ స్వరాజ్ ప్రతులను ఆయనే ఐదు, పది, యాభై రూపాయలకు అమ్మాడు. దాని ముఖ విలువ నాలుగు అణాలే. దండి సత్యాగ్రహం సమయంలో ఆయన తయారుచేసిన అర తులం ఉప్పును ఆయన అభిమాని 525 రూపాయలకు కొన్నాడు. అపుడు అరతులం బంగారం ఖరీదు 50 రూపాయలు ఉండేది. ప్రపంచంలో ఏ వ్యాపారీకూడా ఉప్పును అంత అద్భుతమైన ధరకు అమ్మి ఉండడు. ప్రజలు ఆయన ఆటోగ్రాఫ్ సేకరించేందుకు ఆసక్తిగా ఆత్రంగా ఉన్నారని ఆయనకు తెలుసు. అందుకే తన ఆటోగ్రాఫ్ కోసం 5 రూపాయలు తీసుకొనేవాడు. వేలాది రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకైనా ఆటోగ్రాఫ్ కావాలంటే మళ్లీ ఐదు రూపాయలు ఇచ్చుకోవాల్సిందే. ఖాదీ అమ్మకాలను పెంచేందుకు ఆయన ఒకసారి ఇస్వయంగా ఖాదీ అమ్మకం దారుడిగా పనిచేశాడు. గజం బద్ధను కుడి చేత్తో ఖాదీ తానును ఎడమ చేత్తో పట్టుకొని ఓచర్ల మీద సంతకాలు పెడుతూ ఆయన చాలా వేగంగా అమ్మకాలు చేశాడు. 50 నిముషాలలో ఆయన 500 రూపాయల విలువైన ఖాదీ వస్త్రాలు అమ్మాడు. ఇంకో సందర్భంలో ప్రయాణంలో ఉండగా ఆయన రైలు ఆగిన ప్రతిస్టేషన్‌లోనూ ఖాదీ అమ్మాడు. ఒక ఖాదీ ప్రదర్శనను ప్రారంభించాడు. ఆ వారంలో 4000 రూపాయల విలువైన ఖాదీ అమ్ముడయ్యింది. సాధారణంగా ఖాదీ వార్షిక అమ్మకాలు 5000 రూపాయలు ఉంటాయి. ఆయన అప్పీలు కారణంగా ఒక ఖాదీ బండారు తన అమ్మకాలను 48 రూపాయల నుంచి 65,312 రూపాయలకు పెంచుకుంది.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614