Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ: పెద్దవారినిఁ బ్రశ్నించు విధముదప్పు
ముప్పుఁగొనిదెచ్చు నా తప్పు మూడు మూర్తు
లకట! సైపరు కనుగొన లక్షయేల?
చూడుమో కర్మసాక్షి! ఓ సూర్యదేవ!
భావం: నేటి కాలంలో పెద్దవారనే భావన లేశమాత్రం కూడా లేకుండా అంతరాలనే విస్మరిస్తూ పెద్దలనే ప్రశ్నించే స్థితి దాపురించింది. ఆ తప్పువల్ల కలిగేది పెనుముప్పే. ఈ విషయంలో లక్ష మాటలేల? ముమ్మూర్తులు కూడా క్షమించరనే సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యా స్వామీ!
తే.గీ తమనుఁ దామెరుగరు సరి తప్పిదముల
నెదుటివారిలోఁ జూపెట్ట నిలుచువారు
తమనుఁ దామెరిగిననాడితరులు మెచ్చు
నదియుఁ జాలదా? జపములు మదినయేల?
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!
భావం: నేటి కాలంలో ఎంతోమంది ఆత్మజ్ఞాన శూన్యులై తమను గూర్చి తాము తెలుసుకునే స్థితిని కోల్పోయి ఎదుటివారిలో తప్పులు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. తమను తామెరిగిననాడు ఇతరుల మెప్పు పొందగలుగుతారు. అది చాలదా? అంతే తప్ప మదిలో జపాలు చేయడంవల్ల కావాలని చేసే దోషాలు ప్రక్షాళన అవ్వాలంటే కావని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యా స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262