Others

కౌశలం అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ మహాసభల్లో ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శనకు వచ్చిన సందర్శకులందరికీ ఆ హస్తకళా వస్తువులకు స్వచ్ఛంద ప్రకటనా ఏజంట్లు కావాలని అడిగేవాడు.
విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని ఆయన ఇచ్చిన పిలుపు వల్ల బెంగాలులో విదేశీ వస్త్రాల వార్షిక అమ్మకం 50 శాతానికి పడిపోయింది. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. విదేశీ వ్యాపారం దాదాపుగా స్తంభించి పోయింది. భారతదేశపు పెరుగుతున్న అవసరాలతోబాటు దాని దిగుమతులు కూడా పెరగాలని ఆయన భావించేవాడు. కానీ మన దేశానికి హాని కలిగించని బ్రిటిషు దిగుమతులను మాత్రమే ప్రోత్సహించాలని భావించేవాడు. చుట్టూ విదేశీ వస్తువులతో మూగి ఉన్నప్పుడు కేవలం ఖద్దరు ధరించినందువల్ల ఏమీ ప్రయోజనం లేదని ఆయనకు తెలుసు. బ్రిటిషు వారితో పెద్ద వ్యాపారస్తులు పారిశ్రామిక వేత్తలు కలసి మన దేశాన్ని దోచుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఆయన భారతదేశం మొత్తాన్ని ఖాదీతో నింపాలనీ మరణిస్తున్న కుటీర పరిశ్రమలను బతికించాలనీ ఆయన కోరుకునేవారు.
శత్రువులా వ్యవహరించే ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి ఆర్థిక సహాయమూ లభించలేదు, ప్రజల సానుభూతి నిరాశాజనకంగా వుండేది. అయినా ప్రజలకు ‘స్వయంసేవ’ యొక్క విలువ నేర్పాలని, తమ ఆహారం, దుస్తులు, ఇతర ప్రాథమికావసరాల కోసం తమ స్వంత శ్రమమీద, నైపుణ్యంమీద ఆధారపడటం నేర్పాలని ఆయన దృఢ సంకల్పంతో వుండేవారు. అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సంఘం, అఖిల భారత నూలు వడికేవారి సంఘం స్థాపించి, వాటి శాఖలను భారతదేశం అంతటా ఏర్పాటుచేశారు. వార్థాలోని మగన్ మ్యూజియం నూలు వడకటం, నేతపని, కాగితం తయారీ, తోలు పని, నూనె తయారీ, ధాన్యం ఆడటం, సబ్బుల తయారీ, తేనెటీగల పెంపకం, వడ్రంగం, కమ్మరం మొదలైన చేతివవృత్తులకు ఆటపట్టుగా మారింది. స్వయంగా వడికిన నూలుతో తయారుచేసుకున్న దుస్తులకన్నా చవకైన దుస్తులుండవనీ, సొంత దొడ్లో పండించుకున్న ధాన్యంతో చేసుకున్న రొట్టె కన్నా చవకైన రొట్టె దొరకదని గాంధీ గట్టిగా చెప్పేవాడు. ఆయన దృష్టిలో డబ్బుకంటే జీవితం విలువైనది, నిరంతరం నిరుద్యోగం, ఖాళీగా ఉండటంవల్ల వచ్చే నిస్తేజం పేదరికం కంటే భయంకరమైనది. జాతీయ సంక్షేమం దృష్టితో ఆయన మన ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని పునస్సమీక్షించేందుకు పూనుకున్నాడు. ‘‘మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ విదేశాల నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటున్నామని తెలుసా? మనం పాలిష్ చెయ్యడంవల్ల ఆహార విలువ కోల్పోయిన బియ్యాన్ని తింటున్నాం, పోషక విలువలు అతి తక్కువగా వున్న పంచదారను ఉపయోగిస్తున్నాం. మిల్లులో తయారైన తక్కువ ఆహార విలువగల పదార్థాలను కొని తింటూ, అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాం. గ్రామాల్లో నూనె గానుగ ఆడేవాళ్ళకు పనిలేకుండా చేశాం. యాభై ఏళ్ల క్రితం గ్రామీణులతో పోలిస్తే, ఇప్పటి గ్రామీణులు సగం తెలివితేటలతో, సగం సమర్థతతో జీవిస్తున్నారు. వాళ్లు పోగొట్టుకొనేది ఎక్కువ, సంపాదించేది తక్కువ. నా పథకంలో గ్రామాల్లో చక్కగా ఉత్పత్తి చేయగలిగినది ఏదైనా పట్టణాలనుంచి దిగుమతి చేసుకోగూడదు’’ అని ఆయన వాదించేవాడు. ఎవరి ధాన్యాన్ని వాళ్లే దంచుకోవాలని, పంచదార బదులు బెల్లం వాడాలని, నూలు వడకాలని, బట్టలు నేయాలని ఆయన ప్రజలకు సూచించేవాడు. విదేశీ సందర్శకులకు మంచి బెల్లం నమూనాలను రుచి చూసేందుకు ఇస్తూండేవాడు.
ఖాదీని మిల్లు బట్టలతో పోల్చడం మానేయాలని ఆయన దేశస్తులందరికీ చెప్పేవాడు. ‘‘మిల్లు యజమాని ఎప్పుడూ తక్కువ ధరకే అందించాలని చూస్తాడు, మనం మాత్రం న్యాయమైన వేతనాలు చెల్లించాలి, చేనేత కార్మికుని జీవనానికి తగినంత వేతనం అతనికి లభించేలా చూడాలి, లేకుంటే మనం కూడా కనబడని దోపిడీని ప్రోత్సహించినట్లు అవుతుంది’’ అనేవాడాయన. ఒక కాగితపు వ్యాపారి కార్మికులకు రోజుకు ఆరు పైసలు చొప్పున జీతమిస్తున్నాడు. అతను ఇంకా తక్కువ ఖరీదుకి కాగితం సరఫరా చేయడానికి ప్రయత్నించాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614