AADIVAVRAM - Others

ఉండేదే రాముడొకడు! ఊరక చెడిపోకె మనసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంగారి సీతానగరం సత్యాగ్రహాశ్రమంలో మహాత్మాగాంధీ ఒకటో, రెండో రోజులు బస చేశాడు. ఆశ్రమ కార్యకలాపాలను, నిర్వహణ పద్ధతులను ఆయన ఎంతో మెచ్చుకున్నట్లు సుబ్రహ్మణ్యం గారిని గూర్చి రాసినవారు అక్షరీకరించారు.
అక్కడాయన బస చేసినప్పుడు - దీనిని విశ్రాంతి అనరాదు. నిరంతర నిర్విరామ ప్రబోధ కార్యక్రమ రూపకల్పన దక్షుడాయన. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అప్పటికి చిన్నపిల్ల. అంటే ఆమెకు ఏ పధ్నాలుగో, పదిహేనేళ్లో ఉండవచ్చు. గాంధీజీకి త్యాగరాజ కీర్తనలు వినిపించేదట. ఆయన చాలా ఆనందపడేవాడని నేత సీతాదేవి అనే సాహితీపరురాలు తాను రాసిన సమగ్ర దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ జీవిత చరిత్రలో ఉటంకించింది. (అంటే ఏమిటని ప్రాథమిక విద్య ఇంగ్లీషులో ఆపోసనం పట్టిన శైశవ బాలబాలికలు అడుగుతారేమో!)
తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి గూర్చి మనకందరికీ తెలుసు కదా! ఆయన మహానుభావుడు. తనను తెలుగు లెంక అని అభివర్ణించుకునేవాడు బసవేశ్వరుడు పరమశివుడికి తాను లెంకనని ఉప్పొంగిపోయినట్లు. సీతారామమూర్తి గారి మేనల్లుడు నాగళ్ల గురుప్రసాద రాయ మహాశయుడు ఒకనాడు ఒక చోద్యం ప్రసక్తం చేశారు. చౌదరిగారి మనవడో లేదా తత్తుల్యుడో ఒక బాలుడు ‘తాతా! బడలిక’ అంటే ఏమని అర్థం అని అడిగితే తుమ్మలవారు ఖిన్నులైనారట. ఆయన తెలుగు లెంక కదా? తన వంశమే మైలపడినట్లు బాధపడి ఉంటారు. పాపం! ఆ పిల్లవాడిని తప్పుపట్టకూడదు. ఆ కుర్రకు ప్రాథమిక లేదా మాధ్యమిక పాఠశాలలో విద్య గరచే బాలబాలికలకు తెలుగు పట్ల అభిరుచి కలిగించేట్లు బోధించారో కాదో! పోనీ! అంత చిన్న వయసున బడలిక, ప్రాలు మాలిక అనే తెలుగు పదాల అర్థం తెలియక పోవటం నేరం కాదు. కానీ ‘నానాటికీ తీసికట్టు నాగంభట్టూ’ చందమైంది తెలుగు. పోనుపోను పల్లెటూళ్ల వీధి బళ్లలోనే కదా అనిషేధం కలుగుతుంది.
అమెరికాలోనైతే ప్రాథమిక విద్యాభ్యసన తరగతుల నుంచే శిశు మనోహ్లాదకర, సృజన సామర్థ్య ప్రేరక ఆసక్తికర చిన్నచిన్న పుస్తకాలు నిర్ణీత, నియత అదనపు పఠనీయాలుగా చదివిస్తారు. ఇటువంటి బుజ్జిబుజ్జి పుస్తకాలు నాలుగైదు వేల సంఖ్యలో, ఇంకా ఎక్కువైనా ఉండవచ్చు చదివిస్తారు. 5 నుంచి 12 తరగతుల విద్యార్థుల చేత కథలు, తమ అనుభవాలు, సభ్య సమాజంలో పౌర విధులు, బాధ్యతలు ఆలోచింపజేసి వాళ్లచేత రాతలో ఉండేట్లు చేస్తారు.
ఇక మన దేశంలో అటువంటి బాల సాహిత్యం శిశు మనోగ్రహణ, ధారణ సామర్థ్యం పెంపొందించే పుస్తకాలు పూజ్యం (అంటే లేవు అని అర్థం) బాలబాలికలను ఉత్తమ పౌరసత్వానికి తర్ఫీదు చేయడం ఎట్లా?
ఇప్పుడు అయోధ్యలో రామాలయం నిర్మించే సమస్య పరిష్కారం అయింది కదా! పదేళ్ల వయసు నుంచి ఇరవై ఏళ్ల వయసు తెలుగు పాఠకులు ఈ విషయమై తమకు ఏమర్థమైంది తేటతెల్లమయ్యేట్లు చెప్పగలరా?
సుప్రీంకోర్టు అసందిగ్ధ తుది తీర్పును గూర్చి మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు, మత నిరపేక్ష దీక్షాదక్షులు రకరకాలైన వ్యాఖ్యానాలు, విశే్లషణలు, దేశ విరోధ (జాతి) ప్రశంసాత్మక ఉటంకింపులు ఇప్పటికి తీర్పు వెలువడి ఇరవై రోజులవుతున్నా తమ ఉక్రోషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. ముస్లింలకు చాలా అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఇక కొన్ని జాతీయ పత్రికలు మరి ఇలాంటి వివాదాలకు ఏ మాత్రం తావు లేకుండా హిందువులకు అతి పవిత్రమైన ఇతర పుణ్యక్షేత్రాల గురించి రచ్చ చేయటానికి వీలు లేకుండా ఈ తీర్పు బల్లగుద్ది (ఐదుగురు ఏకకంఠులై) చెప్పినట్లు చెక్కిలితో నాలుక నొక్కి (టంగ్ ఇన్ ది చీక్) సంతృప్తి చెందుతున్నారు. 1991లో అటువంటి తీర్పు వెలువడిందట. అది అనుల్లంఘనీయమై తీర్పు అట. ఇంతటితో ఇటువంటివి సమసిపోయినట్లే అని హర్షాతిరేక ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఆశ్చర్యకర విషయం! బాబరు చక్రవర్తి అట. తొలి మొగల్ చక్రవర్తి అట. బాబర్ ఈ దేశంలో ప్రధానంగా ఉత్తర హిందూస్థానంలో ఆ వైపు ఈ వైపు దండయాత్రలకు వెళ్లింది నాలుగు సంవత్సరాల కాలమే. దక్షిణ హిందూస్థానం వైపు చూపు ప్రసరించలేదు. మరి అతడు చక్రవర్తి ఎలా అవుతాడు? అతడి సేనాని మీర్‌బక్ష్ అయోధ్య అంతకు పూర్వం అక్కడ విరాజిల్లుతున్న భవ్యాతిభవ్య శ్రీరామాలయం కూలగొట్టకుండానే సాఫుగా, చదునుగా ఉన్న భూమిపై మసీదు నిర్మించాడట. కూలగొట్టాడనటానికి సాక్ష్యాలు ఇదమిత్థంగా చూపలేము - అని సుప్రీంకోర్టు అనలేదా? అని మూర్ఖిస్తున్నారు మార్క్సిస్టులు. నిజమే అక్కడి విజన భూమిపై బాబరు సేనాని ముగ్గుమ్మట మసీదు నిర్మించాడనే వాదం కోసం కాసేపు అంగీకరించినా అంత పెద్ద మసీదు కట్టడానికి రళ్లెత్తిన కూలీలెవ్వరు? హిందువులు తమ ప్రాణాలు పోయినా సహకరించరు కదా! బాబరేమో దండయాత్ర సంసిద్ధుడై ఉంటే, పోనీ ఆయన సైనికులు మసీదు నిర్మాణంలో పాల్గొన్నారనటానికి వీలులేదే! అతణ్ణి చక్రవర్తి అని చొంగకార్చుకోవడానికి అవకాశం ఎక్కడిది? సమర్‌ఖండ్ నుంచి వచ్చాడు, చిల్లరమల్లర యుద్ధాలలో కొంత భాగం దురాక్రమణ చేసి ఉండవచ్చు. (నాలుగేళ్లు) అయోధ్యలో శ్రీరాముడి ఆలయం కూలగొట్టకుండా లేదా ఆ పునాదులు, స్తంభాలు యథాతథంగా మసీదకరించకుండా ఉండటం ఎలా సంభవం? సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ రాజీవ్‌ధవన్‌గారు హిందువులు ఎన్నో దండయాత్రలు చేశారు. తమతోటి రాజ్యాలతో, ముస్లింలు దండయాత్రలు చేస్తే దోషమేమిటి? అని ‘లా’ పాయింట్ లాగారు. అది తెగిందనుకోండి. నిజమే. చిన్నచిన్న హిందూ రాజ్యాలు పరస్పర కలహశీలురై, అవివేకులై ఇరుగు పొరుగు రాజ్యాలపై కదనభేరి ప్రయోగించిన విషయం వాస్తవమే కానీ గుళ్లను, గోపురాలను వారు విధ్వంసం చేయలేదే! ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది ముస్లింల సంస్కృతిని, మత విశ్వాస దీక్షను వేనోళ్ల కొనియాడిన రాజీవ్ ధవన్‌కు. ఇక గాంధీ మహాత్ముడి మునిమనవడైన తుషార్ గాంధీగారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు- ఇంత అన్యాయమా అని. మహాత్మాగాంధీగారే జీవించి ఉన్నట్లైతే ఎట్లు ఉండేదో అని లబలబత్వం వెలిబుచ్చారు. నిజమే గాంధీజీ స్పందన ప్రతిస్పందన ఎట్లా ఉండేదో?! సందేహాస్పదంగానే ఉండేదేమో. మన సోదరులు ఇస్లామీయులు రామరామ! వారిని జొప్పించకూడదు అనేవారేమో! రాముడు ఎక్కడో లేడు కనుక! అక్కడొక్కచోటే ఉన్నాడా? అనేవారేమో! అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీద్వార వలే చైవసప్రైతే మోక్షదాయకా! అని అన్నట్లు ఖురాన్‌లో గానీ, అరబిక్, పర్షియన్‌లలో గానీ అయోధ్య మసీదు మాకు గయా ప్రయాగ కాశీల వంటిది అని ఉందేమో చూపగలరా ముస్లింలు. సమరసభావం, సహృదయత, సౌదర్యం లేకపోగా ముస్లింలకన్నా గింజుకుంటున్నారు మన కుహనా మార్క్సిస్టులు, సెక్యులర్ రూక్ష దిదృక్షులు. ఇన్నాళ్లకు ఉండేదే రాముడొకడు అని త్యాగరాజ స్వామి అనే దివ్య సంగీత ఋషి వాక్కు ఫలించింది కదా! అదే చాలు.
*

-అక్కిరాజు రమాపతిరావు