Others

తెలుగుదనానికి చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు భోగరాజు జయంతి
*
డాక్టర్ భోగరాజు పట్ట్భా సీతారామయ్య నవంబర్ 24, 1880న జన్మించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ఈయన ప్రజలకు చిరపరిచితులు. కృష్ణాజిల్లా గుండుగొలను గ్రామంలో భోగరాజు సుబ్రమణ్యం, గంగమ్మ దంపతులకు పట్ట్భా జన్మించారు. భోగరాజు ఇంట్లో ప్రతి సంవత్సరం ‘రామపట్ట్భాషేకం’ జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు ఈయనకు పట్ట్భా సీతారామయ్య అనే పేరు పెట్టారు. పట్ట్భా తండ్రి గ్రామ కరణంగా పనిచేసేవారు. వీరికి ఒక అన్న, ఆరుగురు అక్కాచెల్లెళ్లు. ఈయన నాలుగవ ఏటనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం అంతా తల్లి గంగమ్మ మీద పడింది. పిల్లల చదువుల కోసం తల్లి తన కుటుంబంతో కలిసి ఏలూరుకి వెళ్లింది.
తన ప్రాథమిక విద్యను ఏలూరు మిషన్ స్కూల్‌లో, మెట్రిక్యులేషన్‌ను అక్కడే పూర్తిచేసి, ఆ తర్వాత బందరులోని నోబుల్ కాలేజీలో ఎఫ్.ఏ. పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యా రు. అక్కడ రఘుపతి వెంకటరత్నం నాయుడుకు వీరు ప్రి యశిష్యులు. ఉన్నత విద్య కోసం మద్రాసు వెళ్లి క్రైస్తవ కాలేజీలో బి.ఏ. 1900లో పూర్తిచేశాడు. అనంతరం మద్రాసులోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎం.బి.డి.యం. డిగ్రీ 1905లో పూర్తిచేసి డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. వైద్యవిద్యను అభ్యసించాక మచిలీపట్నంలో డాక్టర్‌గా ప్రాక్టీసును ఆరంభించారు. తర్వాత గాంధీజీతో పరిచయం ఏర్పడి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా స్వా తంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో జరిగిన కాం గ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పురుషోత్తమదాస్ టాండన్‌పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను పట్ట్భాని పోలీసులు అరెస్టుచేసి మూడు సంవత్సరాలపాటు అహ్మద్‌నగర్ ప్రాంతంలోని రహస్య ప్రదేశంలో వుంచి చిత్రహింసలపాలు చేశారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని భావించి, ఆ ఆశయసిద్ధి కోసం ఎంతగానో కృషిచేశారు. వీరి చొరవతోనే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. వ్యాపారవేత్తగా ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారు. ఆంధ్రా బ్యాంక్ (1923లో స్థాపన), ఆంధ్రా ఇన్సూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంక్, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు మొదలైనవి స్థాపించారు. ఆంధ్రా బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందించి వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పడ్డారు. తెలుగు భాషాభిమానిగా ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు మాట్లాడే జిల్లాలలో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించారు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించారు.
పట్ట్భా సీతారామయ్య వేషభాషలలో తెలుగుదనం ఉట్టిపడుతుండేది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినా, గవర్నర్‌గా మధ్యప్రదేశ్ వెళ్లినా ఆయనలో ఎలాంటి దర్పం రాలేదని సన్నిహితులు చెబుతుండేవారు. కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. సుమారు 1700 పుటల కాంగ్రెస్ చరిత్రను కేవలం రెండు మాసాలలో పూర్తిచేశారు. తన మేధాశక్తితో ఖద్దరు, వధలు, స్వరాజ్యము, మన నేత, పరిశ్రమ భారత్, జాతీయ విద్య తదితర పుస్తకాలను రచించారు. వీరు 1919లో మచిలీపట్నంలో ‘జన్మభూమి’ పేరిట ఆంగ్ల వారపత్రికను స్థాపించారు. 1930 వరకు వీరి సంపాదకత్వంలో ఆ పత్రిక నడిచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్ఠించారు. రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 1952నుండి 1957 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటునందించిన పట్ట్భా 1959, డిసెంబర్ 17న పరమపదించారు.

-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట