Others

శ్రమనే దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతకంటే తక్కువ ధరకు తాను కాగితం కొనలేనని గాంధీ అతనికి చెప్పాడు.
రైతుల, గ్రామీణ వృత్తి నిపుణుల లాభాలను పీల్చేసే దళారీ వ్యవస్థను నిర్మూలించాలని గాంధీ కోరుకున్నాడు. భూమిని దునే్న రైతులకు వారి ఉత్పత్తుల పూర్తి ధర ముట్టడంలేదని ఆయనకు తెలుసు. వినియోగదారులు చెల్లించే ధరలో కొంత భాగం మాత్రమే వారికి చేరుతోంది. వారి నిజమైన సమస్య ధరలు తక్కువగా ఉండటంకాదు, దళారీలే. వ్యాపారులు ఆహారం, బట్టల సరఫరాను నియంత్రించడానికి, అక్రమంగా నిల్వచేసి, అధిక లాభాలు పొందడానికీ ఆయన వ్యతిరేకి. మోసం ద్వారా సంపద పోగుచేసుకొని, మతపరమైన కార్యక్రమాలకు భారీగా విరాళాలివ్వడం ద్వారా ఆ పాపాన్ని కడిగేసుకోవాలని భావిస్తున్నారని ఆయన వ్యాపారస్తులపై ఆరోణ చేసేవాడు. ‘‘పెద్ద వ్యాపారులు, పెట్టుబడిదారులు మాటల్లోనే బ్రిటీషువారికి వ్యతిరేకం, పనుల్లో మాత్రం బ్రిటీషువారికి అనుకూలం. దానివల్ల వారికి వచ్చే లాభం 5 శాతం, బ్రిటీషువారికి వచ్చే లాభం 95 శాతం అయినా వారి బుద్ధి మారడంలేదు. స్వదేశీ ఉద్యమం జావగారిపోయేందుకు కారణం వ్యాపారస్తులు విదేశీ వస్తువులను కూడా స్వదేశీ ముసుగులో అమ్మేయడమే. భారతదేశానికి నష్టాలు తెచ్చింది వ్యాపారులే అనడంలో నాకెలాంటి సందేహమూ లేదు. అయితే వారి ద్వారానే నేను ఆ నష్టాన్ని భర్తీ చేయగలననే విశ్వాసం నాకుంది’’ అనేవాడాయన.
రైతు
రైతును ఈ ప్రపంచానికి తండ్రిగా వర్ణించే కవితను ఒకదాన్ని గాంధీ చదివాడు. ‘‘ఈ సృష్టిలో అన్నీ సమకూర్చినవాడు దేవుడైతే, రైతు అతనికి చెయ్యిలాంటివాడు’’ అంటుంది ఆ కవిత. రైతులకు పేదరికం నుంచీ, అజ్ఞానం నుంచీ స్వాతంత్య్రం కల్పించడంలో దేశ స్వాతంత్య్రం ఉందని ఆయన గట్టిగా చెప్పాడు. ‘‘75 శాతంమందికి పైగా జనాభా వ్యవసాయదారులు. భూమికి జీవం రైతే, భూమి ఎక్కడో కనబడకుండా ఉండే భూస్వామికి కాక, రైతుకే చెందాలి- ‘్భమి అంతా దేవుడిదే’. రైతుల వద్ద నుంచి వారి కష్ట ఫలితాన్నంతా దాదాపుగా లాగేసుకున్నాక, మనకు స్వరాజ్యం కూడా పెద్దగా మిగలదు. మన విముక్తి కేవలం రైతుల ద్వారానే లభించగలదు. న్యాయవాదులు కానీ, వైద్యులు కానీ, ధనవంతులైన భూస్వాములు కానీ దాన్ని సంపాదించలేరు’’, అనేవాడాయన. దేశపు పన్నులలో 25 శాతం రైతులనుంచే వసూలవుతాయి. భూమిశిస్తు భారం ఎక్కువగా ఉంది. ఎక్కడైనా ఒక రాజమహలు లాంటి భవనాన్ని కడుతున్నారని వినగానే, అలాంటిదాన్ని చూడగానే ‘‘ఆహా ఈ డబ్బంతా రైతులనుంచే వచ్చిందే కదా’’ అనేవాడు. నగరాల్లో అభివృద్ధి చిహ్నాలన్నీ ఆయనకు పన్నుల భారంతో, అక్రమ వసూళ్లతో, ఎప్పటికీ తీర్చలేని అప్పులతో, నిరక్షరాస్యతతో మూఢ నమ్మకాలతో, రోగాలతో బాధపడుతున్న రైతులనే గుర్తుచేసేవి.
గాంధీ రైతుగా జన్మించలేదు, కానీ రైతుగా అయ్యేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశాడు. చిన్నతనంనుంచీ ఆయనకు పళ్ల మొక్కలు పెంచటమంటే ఇష్టం. ప్రతిరోజూ సాయంత్రం బడినుంచి రాగానే బకెట్లతో నీళ్లు మోసి, డాబా మీద వున్న మొక్కలకు నీళ్లుపోసేవాడు. 36 ఏళ్ళ వయసులో ఆయన ఆశ్రమంలో రైతులా జీవించడం ప్రారంభించాడు. ఆశ్రమం నిర్మించేందుకు భూమికోసం వెతుకుతున్నపుడు పళ్ల చెట్లతో నిండిన ఒక ఎకరం భూమి ఆయనను ఆకర్షించింది. ఆయన దాన్ని కొని, అక్కడే కుటుంబంతోనూ, స్నేహితులతోనూ స్థిరపడ్డాడు. నిదానంగా వ్యవసాయం మొదలుపెట్టి న్యాయవాద వృత్తి మానేశాడు. అక్కడి నివాసాలను ఆశ్రమవాసులే నిర్మించుకున్నారు. గాంధీ భూమిని దునే్నవాడు, నీరు మోసేవాడు, పళ్లూ, కూరగాయలూ పెంచేవాడు. కలపను నరికేవాడు. కొద్దికాలంలోనే ఆయన ఆ భూమిని ఒక ఉద్యానవనంగా మార్చేశాడు.
దక్షిణాఫ్రికాలో పదేళ్లపాటు గడిపిన రైతు జీవితం ఆయనకు వ్యవసాయానికి సంబందించిన మంచి పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని ఇచ్చింది. హింసాత్మకమూ, శాస్ర్తియమూ అయిన తేనెటీగల పెంపకాన్ని ఆయన ప్రచారంలోకి తెచ్చాడు. ఈ పద్ధతిలో తేనెపట్టును నాశనం చేయడం, తేనేటీగలను చంపడం ఉండదు. వ్యవసాయ భూములకు దగ్గరగా తేనెటీగల పెంపకం నిర్వహిస్తే దిగుబడులు ఎలా పెరుగుతాయో ఆయన వివరించేవాడు. తేనెటీగలు పూవుల నుంచి తేనె తాగేటప్పుడప్పుడు తమ కాళ్లతో పుప్పొడిని ఒక చోట నుంచి మరొకచోటికి మోసుకుపోతాయి. దీనివల్ల పంటల నాణ్యత, దిగుబడి పెరుగుతాయి.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614