Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

16
శిథిలాలలో ఇరుక్కున్న
నాగరకతా శిల్పాల్ని నిలబెట్టుకోవాలి- అప్పుడవి
చరిత్రకు
పాత సంగతులే- కొత్తగా చెబుతాయి
‘‘కలలు కరంగి పోయినవి కాలఖగమ్ము విశాల పక్షముల్
జల జల నార్చి యే దెసకు సాగినదో యెఱుగంగ నేర; మీ
నిలచిన వాస్తవ ప్రకృతి నీరవ కంఠమునెత్తి మెల్లగా
బలుకు విషాద ధోరణుల భావము నింపగదోయి నెచ్చెలీ’’
సూర్యాస్తమయాన్ని సేవిస్తేనే
రేపటి ప్రభాతం
సంధ్యా చషకంలో ప్రతిబింబిస్తుంది..
నదిలోని ప్రవాహ జలాన్ని
సూర్యుడు బంగారు ద్రవంగా మార్చినట్లు
కర్తవ్య పాలన కోసం కాలం
ఋతువుల్ని మారుస్తుంది
ఎక్కడ దుఃఖం పక్షిపాటుకు అక్షరమయిందో
అక్కడ ఒక ఇతిహాసం
మనిషిని భూమి మీదకు పంపింది- వాడు
అంతరాత్మ కల్లోలంలో అకస్మాత్తుగా మునిగి
చరిత్రగా పైకి తేలి వచ్చాడు
అస్తమించే నక్షత్ర లోకాన్ని ఓదార్చే
వాడు వాజసని...

- సాంధ్య శ్రీ 8106897404