Others

నేర్చుకోవాల్సింది త్యాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమికి సారం లేదని కానీ మంచి పనిముట్లు లేవని కానీ, నీటి సరఫరా తగినంతగా లేదని కానీ వచ్చే ఫిర్యాదులను గాంధీ కొట్టిపడేసేవాడు. తన భూమిని చక్కగా ఉపయోగించుకొనే తెలివితేటలే రైతుకు అన్నిటికంటే పెద్ద ఆస్తి అని ఆయన అనేవాడు. రైతనేవాడు శక్తివంతుడిగా, తన మీద తాను ఆధారపడేవాడుగా, రకరకాల పనులు చేయగలవాడిగా ఉండాలని ఆయన భావించేవాడు. నరుూ తాలీమ్ నిర్వాహకుడు వాళ్లకు అందుబాటులో ఉన్న భూమి వ్యవసాయానికి పనికిరాదని చెప్పినపుడు ఆయన ‘మేం దక్షిణాఫ్రికాలో ఎలాంటి భూమితో పని మొదలుపెట్టాల్సి వచ్చిందో నీకు తెలియదు. నేనే నీ స్థానంలో ఉంటే నాగలితో పని మొదలుపెట్టను. పిల్లలకు చిన్న పలుగు ఇచ్చి, దాన్ని ఎలా వాడాలో నేర్పుతాను. అదొక కళ. ఎద్దులతో పనిచేయించుకోవడం తర్వాతి దశ. పలుచగా గుల్ల సున్నాన్ని కానీ, పశువుల ఎరువునుకానీ చల్లితే మనం రకరకాల కూరగాయలు కుండీ మొక్కలలో పెంచవచ్చు. మానవ మలాన్ని లోతు తక్కువ కందకాలలో పూడ్చి ఎరువుగా మార్చడానికి 15 రోజులకంటే ఎక్కువ సమయం పట్టదు. వ్యవసాయాన్ని గౌరవప్రదమైన పనిగా భావించడం మన పిల్లలకు నేర్పాలి. అదేమీ తక్కువ స్థాయి వృత్తికాదు. గొప్ప వృత్తి’’ అన్నాడు. ప్రాథమిక విద్యా పథకంలో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషించగలదని గాంధీ భావించాడు.
భారతదేశ విభజనకు ముందు రోజులో నౌఖలీలోని హిందువులు ఆయనను ‘‘మేము ఇక్కడ ఉండటం ఎలా? మేం ఏం తినాలి? ముస్లిం రైతులు మాతో సహకరించడంలేదు, మాకు నాగళ్లు కాని, ఎద్దులు కానీ ఇవ్వడంలేదు’’ అని గాంధీని అడిగారు. అప్పుడు ఆయన ‘‘అయితే పలుగులతో తవ్వండి. పలుగులతో తవ్విన నేలలో పంట దిగుబడులేమీ తగ్గిపోవు’’ అని బదులిచ్చాడు.
1943లో గాంధీ జైలులో ఉన్నపుడు బెంగాలులో లక్షలాదిమంది ప్రజలు ఆకలికి మాడి చనిపోయారు. ఆ దుర్ఘటన జ్ఞాపకాలు ప్రజలు, అధికారుల మనసులో తాజాగా ఉన్నాయి. 1947లో మళ్లీ కాటకం వస్తుందని భయం వేసినపుడు గాంధీ సలహా తీసుకొనేందుకు వైస్రాయి తన కార్యదర్శిని విమానంలో సేవాగ్రామ్‌కు పంపాడు. గాంధీ నిర్భయంగా ఉన్నాడు, రాబోతున్న విపత్తు గురించి భయాందోళనలు వదిలేయాలని ఆయన ప్రజలకు సూచించాడు. ‘‘మనకు సారవంతమైన భూమి చాలా ఉంది. తగినంత నీరుంది, మానవ వనరులకు చోటులేదు. మరి మనకు ఆహార పదార్థాల కరువు ఎందుకొస్తుంది? తనమీద తాము ఆధారపడటం ప్రజలకు నేర్పాలి. రెండు గింజలు తినేవాడు నాలుగు ఉత్పత్తి చేయగలగాలి. ప్రతి వ్యక్తీ సొంతానికి వినియోగించగల ఏదో ఒక ఆహార పదార్థాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకోవాలి. కొద్దిగా మట్టిని, కొంచెం పశువుల ఎరువునూ తీసుకొని ఒక కుండ పెంకులో వేసి, అందులో నాలుగు విత్తనాలు చల్లి నీళ్లు పోయడం అందరూ చేయదగిన తేలికైన పని. అన్ని రకాల ఆడంబరమైన ఉత్సవాలూ నిలిపివేయాలి, విత్తనాల ఎగుమతులు ఆపివేయాలి. నిల్వ చేయగల ధాన్యాలనుంచి కాకుండా కారట్లు, చిలకడ దుంపలు, బంగాళా దుంపలు, కంద, అరటి వాటినుంచి కావలసిన పిండి పదార్థాన్ని పొందవచ్చు’’ అని ఆయన సలహా ఇచ్చాడు. ఆయన స్వయం సహాయక ప్రణాళికను అమలు చేయడానికి దృఢసంకల్పం, క్రమశిక్షణతో కూడిన కృషి, నిరాడంబరత, కొత్త ఆహార అలవాట్లకు అలవాటుపడే గుణం, విదేశాల ముందు చేయి చాచకూడదనే అభిమానం ఉండాలి.
ఆహారం, దుస్తుల సరఫరా మీద నియంత్రణలు విధించినప్పుడు గాంధీకి ప్రభుత్వ కోటాలతో పనిలేకపోయింది. ఆయన బియ్యం, గోధుమలు, పప్పులు లేకుండానే తిండి తినగలిగాడు, పంచదార వాడటం మానేశాడు. తన బట్టలు తానే తయారుచేసుకున్నాడు.
చేతికి అందుబాటులో వున్న పదార్థాలతో, పైసా ఖర్చుకాని ఆవుపేడ, మానవ మల మూత్రాలు, కూరగాయల తొక్కలు, నీటిలోని నాచు, కలుపుమొక్కలతో సేంద్రియ ఎరువు ఎలా తయారుచేయాలో ఆయన హరిజన్ పత్రికలో వివరించాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614