Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

17
మీరు నాకోసం వేసిన కేకకు ప్రతిగా
నా సర్వేంద్రియ శక్తిని ఒక పద్యం చేసి- ఱెక్కలు తొడిగి
నిన్నటి మీ శిశిర వనం మీది వొదిలాను
ఋతువుగా మారిపోయిన క్షణాలన్నీ
మీ కన్నుల కొమ్మలమీద
కందువ నిలిపిన చైత్ర స్వరాలయ్యాయి
అదృష్టవంతులు మీరు- శబ్ద పల్లవాన్ని చేజిక్కించుకున్నారు
నా పాట చరణాలను పక్షయుగ్మం చేసుకుని
తోటంతా కలయతిరుగుతున్న సీతాకోక చిలుకలు
ఇవాళ మీ ఆశలు ఆశయాలు కలసిన లిపితో
వాక్యమాలను ధరించిన నేల పరిమళ హృదయాన్ని
చెట్టుకు దానం చేసిన శుభదినం..
ఎవరి గొంతు జలపాతమైన పాటగా పొర్లి
ఇంకా పొదని వదలి పోలేదో
అది పూలమీద గాలి చేసే నైతిక దండయాత్ర
అవయవాల మీద ఆస్వాంత బారిమ పల్లవించనివాడు
ఎదుటి ఎడద లోతుల్ని ముట్టలేడు
పచ్చదనం కోసం నిలువెల్లా పరితపించనివాడు
తోటివాడింటి వాకిలికి స్నేహ తోరణం కట్టుకోలేడు..
స్వేద వౌక్తికంలో వర్ణ విభ్రాజితమైన హరివిల్లు మాత్రమే
శ్రామిక దేహాన్ని వసంత వాహకంగా శిల్పిస్తుంది

పాట గాలుల మీద తేలిపోతున్న ప్రత్యూష ప్రభ రాత్రి కన్న కల..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404