Others

సాహిత్యం దైవీగుణ సంభరితం ( సుహృల్లేఖ -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత - సాహిత్య సంచారిణి
*
‘‘ఆఢ్యోవా పి దరిద్రోవా, దుఃఖిత స్సుఖితో పివా
అదోషోవా సదోషోవా, వయస్యః పరమాగతిః’’
- అంటాడు కిష్కింధలో వాల్మీకి. ‘ఉన్నవాడుగానీ, లేనివాడుగానీ- వాడు దుఃఖిగాని, పరమ సుఖిగాని- దోషిగాని, నిర్దోషిగాని- దేనికైనా చివరకు మిత్రుడే గతి’’- అని. ఉపకారం చేయడమే మిత్రుని లక్షణం. అపకారం చేయడమే శత్రు లక్షణం వలె! ఏ కార్యసాధనకైనా ముందు స్నేహమవసరం. బుద్ధిమంతుడు పెక్కండ్రు మిత్రులు సంపాదించుకొనవలెనని నీతిచంద్రికలో చెప్పాడు చిన్నయసూరి. మైత్రికి జాతి మత కుల వయో లింగ వివక్షత లేదు. రాముడు, సుగ్రీవుడు ఒక జాతివారు కాదు. ఒక ప్రాంతంవారు, సమాన వయస్కులు కూడా కారు. అగ్నిసాక్షిగా మిత్రులయి ఉభయులు తమ తమ కార్యాలను విజయవంతంగా సాధించుకున్నారు. మైత్రివలననే గుహుని, శబరిని అనుగ్రహించాడు రాముడు. ప్రతిఫలం ఏ ఒక్కరు ఏ ఒక్కరినుంచి కోరలేదు. కృష్ణ కుచేలుర స్నేహం మైత్రికి చక్కని ఉదాహరణ. కృష్ణుడు రాజవంశంలోపుట్టినా, ఆయన రాజ్యాధికారం చేపట్టి, పెద్దగా రాజ్యం చేసిన దాఖలాలు లేవు. ఇద్దరు ఒక కులంవారు కారు. సాందీపని వద్ద సహాధ్యాయులు. ఆస్తులు వేరు అంతస్థులు వేరు. కుచేలుడుకూడా, యాచిద్దామని వచ్చి కూడా యాచించలేదు. ఆయన కూడా కృష్ణునివలెనే అభిమానధనుడు. ఈ స్వాభిమానమే- యిద్దరిని మిత్రులను చేసింది. మరొకటి- రాముడు, సుగ్రీవుడు వేరు వేరు సందర్భాలలో- మాటలు వేరుగా ఉన్నా- తమ మనస్సులు విప్పి మాట్లాడుకుంటారు. ‘నోక్తం మయా పూర్వ మనృతం- నచవక్ష్యే కదాచన’- ‘ఇతః పూర్వం నేను అబద్ధం చెప్పలేదు. ఇకముందు చెప్పను’ అని. అదిగో! ఆ సత్యసంధత, స్వాభిమానం, పౌరుషం, త్యాగం- అనే దైవీగుణాలు ప్రాతిపదికగా మైత్రి ఏర్పడుతుంది. సాహిత్యం దైవీగుణ సంభరితం. ఉపకారం చేసేది. ఇది భూమికగా మనం పరస్పరం మిత్రులం.

- ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి