AADIVAVRAM - Others
మైదానోళ్లం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 November 2019
-గిరిప్రసాద్ చెలమల్లు 94933 88201
గిరిజనం
మునిగినా
గిరిజన గూడేల ముంచినా
నోరు మెదపని మైదానోళ్లం
పోలవరం కట్టేద్దాం
డబ్బులు వెదజల్లుదాం
సంస్కృతిని నాశనం చేద్దాం
వాడి ఉనికినే పాతరేద్దాం
వాడు మాత్రం అదే లోయల్లో
పైకో కిందికో జరుగుతూ
అక్కడే ఆవాసం
అడవి వాడి సావాసం
అల్లంతదూరాన
మునిగిపోతున్న పడవ
మైదానాపోళ్లు మునకేస్తుంటే
తల్లడిల్లిన వాడు
హుటాహుటిన వాడు
సుడులు తిరుగుతున్నా
ప్రాణ రక్షణకై ప్రాణాలకి తెగించినాడు
దునియా ముట్టి పే
నహీ హై వహా
వాడే దిక్కు అచ్చోట
వాడి కోసం నువ్వు ప్రశ్నించకపోయినా
వాడు నీ కోసం
ఎవడు నాగరికుడు?!