Others

సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సంతోషం సగం బలం’ అన్నారు పెద్దలు. భాగవతంలో పోతన ‘‘సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగును సుఖము....’’.. అని పద్యంలో వివరించినట్లు సంతోషంగా వుండేవాడు ముల్లోకాలలోనూ గౌరవింపబడతాడు. సంతోషం కలవానికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోతే తిరిగి జన్మ ఎత్తవలసి వస్తుంది. సంతోషంగా వుంటే సౌఖ్యం కూడా సమకూరుతుంది. సంతోషంగా వుండాలంటే ముందు సంతృప్తిగా వుండాలి. అప్పుడు అసూయాద్వేషాలు కానీ, దుఃఖం కానీ వుండవు. నిరాశా నిస్పృహలకు తావు ఇవ్వకుండా లక్ష్యాలను, ప్రణాళికలను రూపొందించుకుంటే చాలు ఎదుటి వారికి ఉంది మనకు లేదు అనే ఆవేదన చెందకుండా ఉన్నం తలో సంతృప్తి పడితే చాలు సంతోషం దానికదే వస్తుంది. సం తోషం తృప్తి ఉంటే చాలు మని ష ఏడుద్వీపాలనైనా అవలీలగా దాట గలడు. నిత్యసంతుష్టులుగా ఉంటే చాలు మంచి పనులకు ప్రేరణ మన మనసు నుంచే లభ్యమవు తుంది. *