Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉనికి ఊహ కలసి అనుభవించే దార్శనిక ‘సత్యం’
కాలపు దారులు తొక్కుకుంటూ
తోటలోకి వస్తోంది గాలి అడుగుల్ని మోస్తున్న గంధం
రాగము రంగులు కలబోసుకున్న
ఒక బింబాత్మక ప్రతీకల దృశ్య బారిమ
జీవన వనంలో తొణికిసలాడే హిరణ్య సంపద...
పక్షిగొంతులో ఉదయం పల్లవించటం
పూవు గుండెలో తేనె ప్రవహించటం
సుప్రభాత సంజ్ఞగా సూర్య కంజాతం
అరుణ తరంగాలమీద తేలటం
దృష్టి అనంతత్వంలోకి
అవధిగా దూసుకుపోవటం
ఎంత నిశ్శబ్ద సాంద్రతో..
దృశ్య చారిమని దోసిళ్ళెత్తిన చూపుదనుకు
కళ్ళ పడవల్ని అనుభూతి ఒడ్డుకు చేరుస్తుంది
వౌన స్వరాలాపనతో మనసు వికచ సాకూతవౌతుంది
వొగరు చిగురు లేకుండానే ఒక మనోహరాంశ
రాగ శీకరమంజిష్ఠ హృదయ సుమవౌతుంది
అక్షరాలు లేని అచ్చమైన ఒక పద్యం
అనాహత నాదగ మధమై అణువణవునాక్రమిస్తుంది
జీవితమనే లోక వ్యాపార వ్యాపకాన్ని
ప్రాణ సంధ్యా కిమ్మరితం చేస్తూ
కర్తవ్యాలంకార శోభతో
కనుల పండువుగా తీర్చిదిద్దాలి...

ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404