Others

ప్రధానం భావమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుమతులుగా వచ్చిన ఆభరణాలను వేలం వేశాడు. గాంధీకి సొంత ఆస్తులు, వస్తువులు వుండేవి కావు. ఒక పేద ఆశ్రమవాసిగా ఆయన ఒక సామూసిక నిధికి ఒక రాగి పైసా విరాళమిచ్చాడు. దాన్ని ఒక అభిమాని 500 రూపాయలకు కొన్నాడు.
యాచకుడు
గాంధీ రోజురోజుకీ ప్రజా జీవితంలో మరింతగా మునిగిపోయి తన కుటుంబానికీ, న్యాయవాద వృత్తికీ సమయం, శ్రద్ధ కేటాయించలేని స్థితికి చేరుకున్నాడు. తాను ప్రజలకు సేవ చేయాలంటే సౌకర్యాలనూ, సౌఖ్యాలనూ వదలి మొత్తం వస్తు సంపదను, ఆస్తులను త్యజించి, స్వచ్చంద పేదరికాన్ని అనుభవిచాలని ఆయన భావించాడు. ఒకానొక స్థితిలో, సంపద కలిగి ఉండటం ఆయనకు నేరంగా అనిపించింది. దాన్ని దానం చేయడం ఆయనకు ఆనందాన్నిచ్చే పనిగా మారింది. ఆయన వద్ద వున్న వస్తువులన్నీ ఒకదాని తర్వాత మరొకటి మాయవడం ప్రారంభించాయి. తనకు తండ్రి నుంచి వచ్చే ఆస్తిపై హక్కును ఆయన వదిలేశాడు. తన బీమా పాలసీ మురిగిపోతుంటే చూస్తూ ఊరుకున్నాడు. నెలకు 4వేల రూపాయలు సంపాదించే న్యాయవాద వృత్తిని వదిలేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మిత్రులు, అభిమానులు తనకిచ్చిన బంగారం, వెండి, వజ్రాల బహుమతులనూ ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌తో కలిపి 65వేల రూపాయల ఆస్తినీ సామాజిక కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఒక ట్రస్టుకు వీలునామా చేశాడు. ఆయన తనకు సురక్షితమైన జీవితం వద్దనుకున్నాడు, తన భార్యా పిల్లలకు కూడా అలాంటి జీవితం లేకుండా చేశాడు.
ఆయన జీవితంలో చివరి 40 సంవత్సరాలు అభిమానులు, స్నేహితులిచ్చిన విరాళాలమీద జీవించాడు. టాల్‌స్టాయ్ క్షేత్రంలో గాంధీ, ఆయన కుటుంబానికి అయిన ఖర్చులను ఆయన జర్మన్ స్నేహితుడు కాలెన్‌బాక్ భరించాడు. భారతదేశంలోని ఆశ్రమాలన్నీ సానుభూతిపరులు, స్వచ్ఛంద దాతల విరాళాలతో నడిచేవి.
పండిత్ మదన్ మోహన్ మాలవీయ ‘బిచ్చగాళ్లకు యువరాజు’ అనేవారు; గాంధీ ‘బిచ్చగాళ్ళకు రాజు’. సామాజిక కార్యక్రమాల కోసం యాచించడంలో గాంధీ ప్రపంచ రికార్డు స్థాపించాడు. గాంధీ తనలో వున్న ఈ సామర్థ్యాన్ని దక్షిణాఫ్రికాలో ఉండగా గ్రహించాడు. నాటల్ ఇండియన్ కాంగ్రెస్ కోసం చందాలు వసూలు చేసే పనికి బాధ్యుడిగా ఉండగా ఇది జరిగింది. ఒక రోజు రాత్రి ఆయన ఒక ధనవంతుడైన దాత వద్దకు వెళ్ళి 80 రూపాయల విరాళం ఆశించాడు. ఎంత బతిమిలాడినా ఆ ధనవంతుడు 40 రూపాయలు మాత్రమే చెల్లించాడు. గాంధీ అప్పటికి ఆకలిగా, అలిసిపోయి ఉన్నాడు, కానీ పట్టుదలతో ప్రయత్నం కొనసాగించాడు. రాత్రంతా అక్కడేకూర్చుని తెల్లవారే సరికి 80 రూపాయలను సంపాదించాడు.
దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయ చారిత్రాత్మక పోరాట కాలంలో 5వేలమంది నిరసనకారులు, వాళ్ల కుటుంబాల పోషణకు కావాల్సిన విరాళాల సమీకరణలో ఆయనదే ప్రధాన బాధ్యత. వారికి రోజుకు 3,200 రూపాయలు ఖర్చయ్యేవి. గాంధీ కేబుల్ ద్వారా పంపిన అభ్యర్థనకు భారతదేశం సానుకూలంగా స్పందించింది. యువరాజులు, ధనిక వ్యాపారులూ సొమ్ములు పంపించారు. ఒక కాంగ్రెస్ సమావేశంలో గాంధీ ఉద్యమానికి విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని ప్రకటించినప్పుడు సభలో వున్నవారు నోట్లు, బంగారం, వెండి రూపంలో విరాళాలు కురిపించారు. గాంధీ అన్ని విరాళాలకు రసీదలు పంపాడు, అందరికీ అయిన ఖర్చులను వివరంగా నివేదించాడు. దాతల మనోభావాలను గౌరవించి, ఒక్క పైసా కూడా సేకరించిన పనికి తప్ప మరే పనికీ ఖర్చుపెట్టలేదు.
ప్రజల సొమ్ము ఖర్చు చేసే విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడు. తిలక్ స్వరాజ్య నిధి గురించి ప్రశ్నలు తలెత్తినపుడు పద్దుపుస్తకాలు తనిఖీ చేసుకొనేందుకు రావాల్సిందిగా విమర్శకులను గాంధీ ఆహ్వానించాడు. తిలక్ స్వరాజ్య నిధికి మూడు నెలల్లో కోటి రూపాయలు సమీకరించాలని ఆయన లక్ష్యం ఏర్పరిచాడు. ఒక వృత్తిపరమైన నాటక ప్రదర్శనకు ఆయన ఐదు నిమిషాలు వచ్చి వెళితే దానిలోని నటులు 50వేల చందా ఇస్తారని ఒక స్నేహితుడు ఆయన్ను బతిమిలాడాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614