Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పశ్చిమాకాశ నికష సువర్ణరేఖ
లొకటొకటి చెరుపుచు బోవుచుండె ప్రొద్దు
గగన దుర్గపు తూర్పు బంగారు తలుపు
తెరువబడియె చంద్రుడరుదెంచు నంచు’’
దివ్య శోభా నివాసమై తేజరిల్ల
ప్రకృతి హృదయాంతరమున ప్రతిఫలించె
నవ నవోనే్మష రాగమ్ము నాదు దృష్టి
పథము
దైహిక శిల్ప నిర్మాణ రహస్యపు లోతులో
పడిపోయింది
నాకు తెలుసు జీవన తరు శాఖల్లో చేరి
పక్షి పాడే పాట
ఋతు చక్రపు చట్రంలోకి చేరిపోతుందని..
పసిబుగ్గలు చిదమగా
పల్లవించే పలాశ కుసుమ పరిమళాలే
గోత్రాలై
ప్రవరాన్వితంగా తరాల్ని శాశ్వతీకరిస్తాయి
పగటి ఎండ
జ్ఞాపకాల్ని
రాత్రి వెనె్నల
అంచుల్లో చల్లగా తేలుస్తూ
భూగోళం గుండ్రంగా తిరుగుతున్నప్పుడు
నిదురించే కనురెప్పల మార్దవ మర్యాదమీదనే
ఊహలు సంతోషాలు ఉనికి సంకేతాలు
పూలు విచ్చుకుంటున్న
పొదరింటి వసంతాలున్నూ...

- సాంధ్య శ్రీ 8106897404