Others

నిర్మల హృదయులకే శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రజలకోసం తన సర్వస్వం వదులుకున్న గాంధీ లాంటి మహాత్ముడికి వరాళమివ్వాలని నా జీవిత కాల కోరిక. అంతేకానీ నేనిచ్చే కొద్ది పైసల వల్ల ఆయన అనుకున్న పనిపూర్తవుతుందని కాదు’’ అని సమాధానం ఆమె ఇచ్చింది.
కొన్ని లక్షల రూపాయలను సమీకరించడం గాంధీకి చిన్నపిల్లల ఆట. ఆయన తన విజ్ఞప్తిని మైకుల ద్వారా, కేబుల్స్ ద్వారా, వార్తాపత్రికల ద్వారా పంపుతుండేవాడు. ఒకసారి ఆయన ఒక జర్నలిస్టు తలమీద టోపీ లాక్కొని, దానిలోనే విరాళాలు సేకరించడం ప్రారంభించాడు. విస్తుబోయిన ఆ జర్నలిస్టే గాంధీ విరాళాల సేకరణకు మొదటి బాధితుడై, ఆయన ఆధునిక భిక్షాపాత్రలోకి విరాళం సమర్పించుకోక తప్పలేదు.
గాంధీ విరాళాల సేకరణకు బర్మా వెళ్లినపుడు ‘‘14 ఏళ్ల తర్వాత నేను మీ దేశానికి వచ్చాను. 14 ఏళ్ళ తర్వాత కరువు వచ్చినా మీరు లెక్క చేయరు కదా, నా పర్యటననూ అలాగే అనుకొని ఈ దరిద్రనారాయణుల ప్రతినిధిని మీ విరాళాలతో సంతృప్తిపరచండి. మరోసారి నేను మీ వద్దకు వచ్చే అవకాశం దొరక్కపోవచ్చు’’ అని పిలుపునిచ్చాడు. అక్కడి ధనవంతులు పీనాసితనంగా ఇచ్చిన కొద్దిపాటి విరాళాలను ఆయన హేళనచేశాడు. ‘‘ఈ చందాల చీటిని చింపిపారేసి కొత్త జాబితా రాయండి. నేను గుజరాతీ వైశ్యుడిని, జేబుల లోపలికల్లా చేతులు పెట్టి ఖాళీ చేయడం నాకు బాగా తెలుసు’’ అన్నాడు. ఆయన హేళనతో చందాలు అప్పటికప్పుడు రెట్టింపయ్యాయి. ఆయన శ్రీలంక వెళ్లినపుడు ‘‘మహేంద్రుడు శ్రీలంక వచ్చినపుడు భారతదేశంలో ఆకలి చావులు లేవు, మీరు కూడా ఆ విజయంలో భాగం పంచుకున్నారు. మీరు భారతదేశంతో వున్న బంధుత్వాన్ని తెంచుకోకుండా ఆ బంధానికి గర్విస్తున్నట్లయితే వారికి ధనమే కాదు, నగలు కూడా ఇవ్వాలి’’ అని పిలుపునిచ్చాడు. ఆయనకు వారు ఇచ్చిన విరాళాలను తమిళులకే ఉపయోగించాలనే విన్నపాన్ని ఆయన తిరస్కరించాడు. ‘‘మీరు నన్ను నమ్మి సొమ్ము ఇచ్చేట్లయితే, దాన్ని ఎక్కడ, ఎవరికి, ఎలా ఖర్చుపెడితే సద్వినియోగం అవుతుందో నాకు తెలుసని కూడా వీరు నమ్మాలి’’
ఆయన ఒకసారి ఆవేదనగా ‘‘నాకు హనుమంతడిలా హృదయం చీల్చి చూపించే శక్తి లేదు. ఉంటే మీకు అక్కడ ఆకలితో మలమలలాడుతున్న వేలాది మంది భారతీయుల ముఖాలలో నాకు కనిపించే రాముడు కనబడి ఉండేవాడు’’ అన్నాడు. ఆయన తరచుగా రోజుకు 12కుపైగా సమావేశాలకు హాజరయ్యేవాడు. ‘‘నాకు అణా, అర్థణా, బేడా, కానీ, పైసా- మీరు ఎంత ఇవ్వగలిగినా ఫర్వాలేదు, ఇవ్వండి’’ అని విజ్ఞప్తి చేసేవాడు. పౌర సన్మానాలలో పాల్గొని మాట్లాడిన తర్వాత ఆయన ‘పర్సేది?’ అని అడిగేవాడు. ‘‘నేను వెళ్లను. మీరిచ్చేదాకా ఇక్కడ కూచుంటాను. వెళ్లి దాని సంగతి చూడండి’’ అనేవాడు. ఆ విధంగా ప్రజల వద్దనుంచి చందాలు వసూలు చేసేవాడు. కొన్నిసార్లు ఆయనకు ఇళ్లు, నగలు, చెక్కులు, బంగారం, వెండి, రాగి నాణాలు, గుట్టల కొద్దీ నూలు విరాళమివ్వడానికి తోపులాడుకొనే ప్రజల గుంపులు అర్థరాత్రి వరకూ వేచి ఉండేవి. ఆయన 78వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు 78 లక్షల నూలు ఉండలు బహుమతిగా ఇచ్చారు.
ఒక హంతకుడు ఉరికంబం ఎక్కబోయే ముందు తన వద్దనున్న 100 రూపాయలను గాంధీకి ఇవ్వాలని ఆఖరి కోరికగా కోరుకున్నాడు. సాధారణంగా ఒక సమావేశంలో గాంధీ సేకరించిన విరాళాలను మోయడానికి, లెక్కించడానికి ముగ్గురు, నలుగురు సహాయకులు అవసరం అయ్యేవారు. ఒకసారి విరాళాల సేకరణ తర్వాత ఒక కార్యకర్త వచ్చి ఆకుపచ్చ కిలుమురంగుతో నిండిన తన చేతులను చూపాడు. అతను సేకరించిన వాటిలో పేదలు ఎంతోకాలంగా దాచిపెట్టుకున్న పాత రాగి నాణాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది చూసిన గాంధీ ‘‘ఈ బహుమతి ఒక ఆశీర్వాదం. మనం దీన్ని కేవలం అంకితభావం అనుకుంటాం కానీ వాళ్ల దృష్టిలో ఈ అవకాశం నిరాశాపూరిత కారుచీకట్లలో ఒక కాంతిరేఖ. రాబోయే మంచి రోజులకు ఒక సూచిక’’ అన్నాడు.
వృత్తిపరమైన యాచనను నిషేధించాలని కోరుకోవటం గాంధీ వైరుధ్య సూచికలలో ఒకటి. అన్ని రకాల గౌరవాన్నీ వదిలేసి పొట్ట నింపుకోవటం కోసం బిచ్చగాళ్లు పెట్టే కేకలు గాంధీ భరించలేకపోయేవాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614