Others

అన్నదమ్ములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాముడు లక్ష్మణునికి అనే్న కాదు, ఆదర్శమూర్తి కూడాను. అసలు రాముడు వేరు లక్ష్మణుడు వేరా అంటే కాదు, ఇద్దరూ ఒక అంశలో పుట్టినవారేనన్నది సత్యం. పుత్రకామేష్ఠి యాగం చేసియజ్ఞపాయస ప్రభావంతో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు జన్మించారు. సుమిత్రకు రాముడి అంశతో లక్ష్మణుడు, భరతుని అంశతో శతృఘు్నడు జన్మించారు.రావణుడు, కుంభకర్ణుడు అరాచకాలకు పాల్పడుతున్నారు. వారిని సంహరించి లోకకళ్యాణం చేయడానికి మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అతని ఆయుధాలైన శంఖ, చక్ర గదలు లక్ష్మణ, భరత, శతృఘు్నలుగా అవతరించారు అనే పురాణం మనకు లభ్యమవు తుంది. రాముడు ఉన్నతాశయాలు కలిగినవాడు. మితభాషి, శాంతిప్రియుడు. ఎవరైనా కోపం తెచ్చుకున్నా వారిని మంచిమాటలతో సానుకూల ధోరణికి వచ్చేట్టు చేసేవాడు. అట్లాఅని కోపం లేనివాడు కాదు. శాంతమూర్తి. ధర్మాగ్రహం వస్తే రామునికి ఎదురొడ్డినిలిచేవారు ఎవరూ ఉండరు. లక్ష్మణుడు ఉగ్రమూర్తి. కోపం వచ్చిందా ఎదుటివారుకోపాగ్నికి ఆహుతి అవ్వవలసినదే. కానీ రాముడు లక్ష్మణుడిని శాంత పరిచి ఎదుటివారిలో తప్పు ను సరిచేయగలమేమో చూసి వారు మారరు అని నిర్ణయంచుకున్న తరువాత మాత్రమే వారిని శిక్షించేవారు. కనుక రామునికి శాంత మూర్తి అన్నపేరు సార్థకం అయంది. లక్ష్మణుడు ఉగ్రమూర్తి అయనా అన్న మాటను జవదాటని తమ్మునిగా పేరుపొందినవాడు అయ్యాడు. అన్నదమ్ములెవరైనా రామలక్ష్మణుల్లా ఉండాలి అనుకొంటారు. *