Others

బలమైన ఎముకలకై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా.. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.
* గుమ్మడి గింజల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలన్నీ ఇందులో ఉంటాయి. శరీరానికి ఇతర విటమిన్లు కూడా అందుతాయి. అందువల్ల వీటిని తీసుకుంటే హృద్రోగాలకు దూరంగా ఉండచ్చు. సెరటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
* నువ్వుల్లో జింక్, కాల్షియం, ఫాస్పరస్‌లు ఎక్కువ. ఇవి ఎముక మజ్జను ఏర్పరచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఎముక పుష్టినీ పెంచుతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును, గుండె జబ్బుల్ని అదుపులో పెట్టుకోవచ్చు.
* అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. ఇవి హార్మోన్ల అసమతుల్యతని తగ్గిస్తాయి. నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వీటిల్లో కావలసినంత పీచు ఉంటుంది. అవిసె గింజల నుంచి అందే మాంసకృత్తులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది. అలాగే బరువు కూడా సులువుగా తగ్గవచ్చు.