Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రసమయంబగు నాత్మ సర్వత్ర బెరసి
సర్వతోముఖ శివబిందు సామరస్య
సకల మధుమాస విభవరసాల శాఖి
యమృత ఫలములు పండించు...’’
ఇప్పుడు నేను బైటికొచ్చాను
చీకటి నిశ్శబ్దము పెనవేసుకున్న అద్వైత నుండి ఆవిర్భవించాను
శబ్దాల గాలివానను చీల్చుకొని
వెలుతురు చేసిన గాయం మాన్పుకొని
మళ్లీ నేను
నిశ్శబ్దము చీకటి కలిసి అద్వైతంలోకి వెళ్ళిపోతాను...
యోగ సమాధినుండి వచ్చి వట్టి జ్ఞాన యోగి నయ్యాను
కర్మయోగినయ్యే జ్ఞానాన్ని యోగం చేసుకొని
మీ ముందుకొచ్చాను, నన్ను ఆస్వాదించండి
గర్జించే వాయువుని ఆయువు చేసికొని
కొండవాగు గొంతులోని పాటనై వచ్చాను..
‘‘మనసు గతిభ్రాంతి మూలంబు తనువు గలుగు
దేవతాభ్రాంతి యగుగాక దివ్యభూతి
భ్రాంతి, జన్మ పరంపరాభ్యస్త విద్య
విద్యకు నవిద్యకుం గూడ వెలితి తెలివి
శబ్ద మర్థంబు వెంబడి సంసరించు
నభిసరించు నర్ధంబు శబ్దాత్మ కొరకు
శబ్దమర్ధంబు శాంతింప సమరసధృతి
బొడము ధ్వని మూర్తి యుభయాత్మ పూర్తియగుచు’’...

- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404