Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరం దగ్గరైనట్లు దగ్గర దూరమైనట్లు
ద్వంద్వ సంస్థితమైన యధార్థ జగతి
తలపు తెరల రంగస్థలి- దాని కధలు
నా కనుల చీకటుల్ పరిణితము చెంది
నిలచు నేకత్వ దీపమై నియమ విధిని
ఒడ్డి గిలబెట్టి కొడిదీయ యుజ్వలించు
రాత్రి దీపము ధాత్రిపై రాజు కొనియె
సగము నిండిన చిన్నారి చందమామ
మోవి చాటున వెనె్నల మూస బోసె
స్మృతి ముకురమందున స్పష్టబింబమొకటి
చూచినట్లు లీలగా దోచునాకు
కనుల కందక నీ మూర్తి కదలుగాని
భావ సామ్రాజ్య మేలుచున్నావు- నీవె
సృష్టి తొలి సంజ విచ్చు పూరేకలమయి
మృదుపరిష్వంగమున నిద్రనొదిగి - జాఱి
దూరమైనాము తెలియని తీరములకు
నీవు నేను పరస్పరానే్వషణమున
విమల మృదుగీతి వైఖరుల్ విహృతించి
పైట తేలుచు నున్నది పైరగాలి స్వప్న కలన చేత
తీగమీదెన చప్పుడు తోచెనంత
ఆత్మవీణ ఊహాగాన మందుకొనగ
నాదురాగమనకు స్థాయి నాకమగును
కనుల వారక మెదలి కాంక్ష రగుల
స్వప్నమొక్కటి చుక్కయై జారిపడును
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404