Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. దేవుడిచ్చిన దేహమ్ము దేశసేవ
లోనఁదరియించవలెఁ గదా జ్ఞాన వంతు
లము మనుజులము మరువంగ రాదు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: భగవంతుని వరప్రసాదమైన ఈ శరీరం దేశసేవలో తరించాలి. మనుషఉలము, అందునా జ్ఞానవంతులము అని ఎన్నడూ మరువరాదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యభగవానుడా! ఈలోకానికి ప్రబోధించవయ్యా స్వామీ!
తే.గీ. కల్లలైనట్టి కలలకుఁ గలత లొంద
రాదయా! యర్థరహితమ్ములాకలలనుఁ
బరిగణఇంచుట యవివేకమరయ సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మంచికలలు, చెడుకలలు అంటూ అర్థం పర్థం లేని కలలకు ప్రాధాన్యత నిస్తూ కలత చెందటడం ఎంతమాత్రం సరికాదు. అసలు కలలను పరిగణనలోనికి తీసుకోవడం అజ్ఞానానికి , అవివేకానికి పరాకాష్ఠ అన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియజేయుమయ్యా సూర్య భగవానుడా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262