Others

శ్రీమంతుడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమంతుడు చిత్రాన్ని విశ్వశాంతి ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మాత జి.రాధాకృష్ణమూర్తి కె.ప్రత్యాగాత్మ దర్శకత్వంలో నిర్మించి 16-7-1971వ తేదీన విడుదల చేశారు. ఇది యావరేజి హిట్ చిత్రమైనా మంచి వినోదంతో కూడిన హుషారైన చిత్రం. టి.చలపతిరావు సంగీత స్వరాలతో చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్ సాంగ్స్. ఆరుద్ర, దాశరథి, కొసరాజు సాహిత్యమందించిన పాటలు సినిమా విజయంతో సంబంధం లేకుండా అత్యంత ప్రజాదరణ పొందాయి. చిత్ర కథనం ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఈ చిత్రం నాకు నచ్చింది. పాటలకోసం చిత్రం పలుమార్లు వచ్చిన ప్రతిసారీ చూసేవారం మా చిన్నతనంలో. అక్కినేని నాగేశ్వరరావు, జమున హీరోహీరోయిన్లుగా నటించారు. సూర్యకాంతం విలన్ (లాంటి) పాత్ర చేశారు. చిత్రంలో గుమ్మడి, రావికొండలరావు, రమణారెడ్డి, రాజబాబు, సాక్షిరంగారావు, రాజేశ్వరి, బాలనటిగా శ్రీదేవి, ఆదినారాయణరావు తదితరులు నటించారు. మైకా గని నేపథ్యంలో ఆస్తులకోసం కుట్రలుసాగే కథనంతో మేనత్త ఆస్తికోసం తమ్ముడి కుమారుడ్ని చెడు వ్యసనాలకు బానిస చేసిన తన బావను తన ప్రేమతో మంచివాడ్ని చేసి మేనత్త కుట్రలు గుర్తించేలా చేసి ఎదిరించి బుద్ధి చెప్పే కథనంతో చిత్రం కొనసాగి ముగుస్తుంది.
చిత్రంలో కొన్ని సూపర్‌హిట్ సాంగ్స్ ‘మొదటి పెగ్గులో మజామజా’, కొంటె చూపులెందుకు లేరా జుంటే తేనెలందిస్తావేరా!’ ‘అహ ఏమందము’, ‘ఎంతో చిన్నది జీవితం యింకా చిన్నది యవ్వనం, అనుభవించరా ఆగదు ఆగదు యవ్వనం, బులి బులి ఎర్రని బుగ్గలదానా, చంపకు చారెడు కన్నులదానా’ చిన్నతనంలో హీరోహీరోయిన్ల అయిన పిల్లలపై బొమ్మలపెళ్లి పాట (పాట గుర్తులేదు) యిలా అన్నీ అలరించే పాటలే! అక్కినేని తాగుడు అభినయం ‘దేవదాస్’లో విషాదాంతమైతే, ఈ చిత్రంలో తాగుడు అభినయం యువతరానికి కిక్ ఇస్తుంది. రాజబాబు కామెడి చిత్రంలో అలరిస్తుంది. ఈ చిత్రంలో ‘వైకుంఠపాళి’ ఆట పటంలో పాముల తలల స్థానంలో విలన్స్ తలలు, ఎక్కే నిచ్చెనలపై మంచి పాత్రల తలల పబ్లిసిటీ మా చిన్నతనంలో వెరైటీగా ఉండేది. ఇప్పుడు ఈ చిత్రకథను యిప్పటి కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకొని అక్కినేని నాగార్జున వారసులు నిర్మాణం చేసుకొంటే వారికి హిట్ చిత్రంగా నిలుస్తుంది. ప్రయత్నం చేసుకోవచ్చు వారు!

-పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి