Others

అలా.. సూసైడ్ క్లబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివరామ చంద్రవరపు ప్రధాన పాత్రలో మజిలీ సినిమా పతాకంపై బొగడపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సూసైడ్ క్లబ్’. ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్యపాత్రల్లో నటించారు. విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో ట్రైలర్ షోను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నిర్మాత ప్రవీణ్ ప్రభు మాట్లాడుతూ -చక్కని పాయింట్‌తో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. టెక్నికల్‌గా సినిమా సరికొత్తగా వుంటుంది. సోషల్ కాజ్‌వున్న కథ నచ్చి రూపొందించాం అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ బొగడపాటి మాట్లాడుతూ -నేను నిజ జీవితంలో చూసిన సన్నివేశం ప్రేరణగా కథ రాసుకున్నాను. అదే సూసైడ్ క్లబ్‌గా రూపొంది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కథానాయకుడు శివ వైవిధ్యంగా నటించారు. వెంకట్ నటించిన పాత్ర యూనిక్‌గా వుంటుంది. యూనిట్‌లో దాదాపు 80 మంది మగవాళ్లమధ్య చందన ఒక్కటే అమ్మాయిగా సినిమా ఉంటుంది. సంగీత దర్శకుడు అందించిన బాణీలు ప్రేక్షకులకు వీనులవింద అన్నారు.