AADIVAVRAM - Others
కారణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 December 2019
మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001
‘పాట పాడాలని అనుకునేవాడికి ఏదో ఒక పాట దొరుకుతుంది’ ఇది ఒక సామెత.
ఇది మన జీవితానికి అన్వయించుకోవచ్చు.
మనం ఎవరినైనా విమర్శించాలని అనుకుంటే ఒక్క కారణం కాదు. లక్ష కారణాలు దొరుకుతాయి.
మెచ్చుకోవాలంటే లక్ష కారణాలు కాకపోయినా కొన్ని కారణాలు దొరుకుతాయి.
మనం అదృష్టవంతులం అని అనుకోవడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి.
అదే విధంగా దురదృష్టవంతులం అని అనుకోవడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి.
దేవుణ్ణి నిందించడానికి ఎన్ని కారణాలు వున్నాయో, అభినందించడానికి మరెన్నో కారణాలు వుంటాయి.
నిరాశావహంగా వుండటానికి ఆశావహంగా వుండటానికి కూడా ఎన్నో కారణాలు దొరుకుతాయి.
ఇలా ప్రతి దానికి అన్వయించుకోవచ్చు.
మంచి వాటికి వీటిని అన్వయించుకుందాం.