Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చేయిఁ జాచిన వారికి ఁ జేతనైన
సాయముం జేయ నిలచిన ఁ జాలువారి
పుణ్య మెన్నంగఁ జాలమీ పుణ్యభూమిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దేహీ! అని చేయి చాచి అడుక్కునేవారికి చేతనైన సాయం చేయడానికి పూనుకుంటే చాలు వారి పుణ్యభూమిలో అటువంటి వారి పుణ్యఫలాన్ని లెక్కించడం సాధ్యం కాదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ఈలోకానికి ప్రబోధించవయ్యా స్వామి.

తే.గీ. దేవతారాధనల కన్నఁ జూవెసేవ
నెఱపి నవ్వారి చెంతన్ నిలచి దేవ
తాళి చల్లంగఁ జూచుగా తరతరాలఁ
జూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: ఆలోచిస్తే దేవతారాధనలు చేయడం కన్నా విస్తృతంగా మానవసేవ చేసినవారి చెంతనే దేవతలంతా నిలచి చూస్తారు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ కదా. ఈ సత్యాన్ని కర్మసాక్షివైన నీవు ఈలోకానికి తెలియజేయుమా స్వామి.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262