Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌందర్యావిష్కరణకు ముందు
అంతరంగమంతా కల్లోలమే
ఎవరు పోసిన జీవమైనా రవళించే ముందు
వేదనా కలిత భావ ఝంఝమే వేణువు
జీవితం మనం అడక్కుండానే
కాలం ఇచ్చిన క్రీడ
దిగంతాలవరకు వ్యాపించిన ఊపిరిజాడ
ఒకే ఒక్క ఘడియ కోసం విరిసి
రంగుల గాలివాన వీస్తున్న కఠోర పుష్పం
వ్యయమయ్యే యుగాల వంటి క్షణాల్ని
పోగుజేసుకుంటున్న బీభత్సోవ గవాక్షం
తల పూల సీతాకోక చిలుకకు
పూల పీట మీద
ప్రభాత కిరణాలతో అభ్యంగనం చేయించి
శాఖాపత్రపు సామ్రాజ్యానికి
చివురు గొడుగు పట్టాలనే కాలం
కంకేళిని కలిసింది
రాత్రి నేత్రాల్లోని దీర్ఘ తమస్సుని
ఎన్ని ప్రశ్నలతో పొడిచినా
రావలసిన సమాధానపు వెలుతురు
వెన్నంటే వుంటుంది
ఆశల చూపుల మీదే తిష్ఠవేసుక్కూర్చున్న గమనం
అవనిలోంచి వచ్చే పూవై
తరు నగ్నత్వాన్ని కప్పుతుంది...

- ఇంకావుంది...

సాంధ్య శ్రీ 8106897404