Others

పవిత్రతే నిజమైన ఆభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ ఆభరణాలు స్వాతంత్య్ర పోరాటానికి విరాళమిచ్చేలా దేశవ్యాప్తంగా అనేకమంది మహిళలకు ఆయన విజ్ఞప్తి స్ఫూర్తినిచ్చింది. ఒక యువ వితంతు గాంధీని తమ ఇంటికి ఆహ్వానించి తన నగలన్నీ ఇచ్చేసింది. నెలకు 40 రూపాయల వేతనం సంపాదించే భర్తగల వివాహిత గాంధీ తమ ఇంటికి వచ్చి తన ఆభరణాలను విరాళంగా స్వీకరించేదాకా ఉపవాసదీక్ష చేసింది.
ఒక బహిరంగ సభలో కౌముది అనే కౌమార బాలిక వేదిక మీదకు వచ్చి తన బంగారు కంఠహారం, గాజులు, చెవిపోగులు గాంధీకి ఇచ్చివేసింది. ‘‘స్ర్తిలకు నిజమైన ఆభరణం వారి పవిత్రతా, సౌశీల్యమే’’, అని చెబుతూ గాంధీ ఒకసారి ఆభరణాలు దానం ఇచ్చిన వారిని మళ్లీ ఆభరణాలు చేయించుకోవద్దని, ధరించవద్దని సలహా ఇచ్చేవాడు. ఆయన చిన్న చిన్న పిల్లలను కూడా వదిలేవాడు కాదు. ఒకసారి ఒక చిన్న బాలిక ఆయనకు పూలు బహుమతిగా ఇద్దామని వేదిక మీదకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు ఆమె ధరించిన ఉంగరం మీద పడ్డాయి. ఆమెను బుజ్జగించి దాన్ని విరాళంగా తీసుకున్నాడు. ఒకసారి బంగారు కంకణంతో నమస్కారం చేయడానికి అవస్తపడుతున్న బాలుడినుంచి ఆ కంకణం తీసుకొని ‘‘ఇప్పుడు చక్కగా నమస్కారం చెయ్యగలుగుతావు. నాకు 195 పాయింట్ల రక్తపోటు ఉందని తెలుసా’’అన్నాడు. గాంధీ ఎప్పుడు చిన్న పిల్లల వద్ద ఆభరణాలు తీసుకున్నా, వాళ్ల పెద్దల అనుమతి పొందేవాడు.
గాంధీ పెద్ద దోపిడీదారుగా పేరుపొందినా ఆయన దోచుకున్న వారితో సహా అందరూ ఆయనను హృదయ పూర్వకంగా స్వాగతించేవారు. అడుగడుగునా ఆదరించేవారు. ఒక అభిమాని గాంధీ తన ఇంట్లో ఉన్న ప్రతి నిమిషానికీ 16/-రూపాయలు చెల్లిస్తానని ముందుకొచ్చాడు. కానీ గాంధీ ఎంత తీరికలేకుండా ఉండేవాడంటే ఆ ఇంట్లో రెండు నిమిషాలకన్నా ఎక్కువసేపు ఉండలేకపోయాడు.
ఒకసారి గాంధీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడని తెలిసి ఆయన డాక్టరు స్నేహితుడు హడావుడిగా ఆయనవద్దకు వచ్చాడు. అప్పుడు గాంధీ ‘‘నీ దగ్గర వైద్యం చేయించుకుంటే నాకేమిస్తావు?’’అని ఆయన్ని వేళాకోళం చేశాడు.
మోతీలాల్ నెహ్రూ, దేశబంధు చిత్తరంజన్ దాస్‌లు రాజాలాంటి వారు తమ న్యాయవృత్తిని గాంధీ పిలుపుమేరకు త్యాగంచేశారు. తమకు వారసత్వంగా వచ్చిన ఖరీదైన భవనాలను, ఆస్తులను దేశానికి రాసిచ్చేసారు. అలా గాంధీ వేలకొలది ధనికులను బీదలుగా మార్చేసాడు.
జైలుపక్షి
గాంధీ తిరుగుబాటును బోధించాడు, సామూహిక పౌర శాసనోల్లంఘనాన్ని ప్రారంభించాడు, అనేకసార్లు జైలుకివెళ్లాడు. అరెస్టు చేసినప్పుడు ఆయన నేరాన్ని అంగీకరించేవాడు, తనకు కఠినశిక్ష విధించమనేవాడు. దక్షిణాఫ్రికాలో ఆయనమీదా, ఆయన సహచరుల మీదా పెట్టిన కేసులు ఆయన సాక్ష్యంతోనే రుజువయ్యాయి. జైలు జీవితమంటే కష్టం, జైలుకి వెళ్లడమంటే అవమానం, జైలంటే భయంకరం, జైలంటే నేరస్తులకు వేసే శిక్ష-ఇవీ సాధారణ భారతీయుల అభిప్రాయాలు. జైలు పేరు చెబితే వాళ్లు వణికిపోయేవారు. గాంధీ ఈ అభిప్రాయాలను, ఆలోచనలను వాళ్ల మనసుల్లోంచి తుడిచేశాడు.
గాంధీ 11సార్లు జైలుకి వెళ్లాడు. ఒక సందర్భంలో ఆయన 4 రోజుల్లో 3సార్లు అరెస్టయ్యాడు. ఆయనకు వేసిన జైలు శిక్షలన్నీ పూర్తిగా అనుభవిస్తే 11 సంవత్సరాల 19 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చేది. ఎప్పటికప్పుడు ఆయన శిక్ష తగ్గించేవారు, దానితో మొత్తం 6 సంవత్సరాల 10 నెలలు జైల్లో గడిపాడు గాంధీ. 39 యేళ్ల వయసులో ఆయన మొదటిసారి జైలుకి వెళ్లాడు. 75 యేళ్ల వయసులో ఆఖరిసారి జైలు గోడల్లోంచి బయటకు వచ్చాడు.
గాంధీ మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో అయిదుగురు సత్యాగ్రహులతో కలసి జైలుకి వెళ్లాడు. అప్పటికి ఆయన జైలు గురించి భయంకరమైన కథలు విని ఉండటంతో కొంచెం ఆందోళన కలిగింది. తనను రాజకీయ ఖైదీగా ప్రత్యేకంగా చూస్తారా, తన సహచరులనుంచి విడిగా ఉంచుతారా లాంటి సందేహాలు తలెత్తాయి.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614