Others

ఆటంక నివారణకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614
*
అనేకసార్లు న్యాయవాదిగా వాదించిన కోర్టులోనే తాను బోనెక్కాల్సి వచ్చినప్పుడు ఆయన మెదడును ఒక రకమైన అయోమయం కమ్ముకుంది. ఆయనకు రెండు నెలల సాధారణ జైలుశిక్ష పడింది. కోర్టుబయట వేచి ఉన్న పెద్ద జన సమూహం నుంచి తప్పించుకొనేందుకు ఆయన్ను రహస్యంగా ఒక కారులో తిన్నగా జైలుకి తీసుకెళ్లారు. జైలుకి వెళ్లిన తర్వాత ఆయన వేలిముద్రలు తీసుకున్నారు. బరువు తూచారు. ఆయన వేసుకొచ్చిన దుస్తులు పూర్తిగా విప్పేసి, చాలా మురికిగా ఉన్న జైలు దుస్తులు ఇచ్చారు. రెండు రోజులకొకసారి, మూడురోజులకొకసారి అనేక మంది స్నేహితులను ఆయన ఉన్న జైలులో వేశారు. ఒక పక్షం రోజుల్లోనే వారి సంఖ్య 150కి పెరిగింది. వారందరినీ 50 మంది పట్టే ఒక గదిలో పెట్టారు. రాత్రులు మాత్రం కొంతమంది ఖైదీలను ఉంచేందుకు కొన్ని టెంట్లు వేసేవారు.
రోజులో నాలుగయిదుసార్లు జైలు ఇనస్పెక్టరు, గవర్నరు, ఛీఫ్ వార్డరు జైలును సందర్శించేవారు. వారు వచ్చినప్పుడు గాంధీ, ఇతరులు టోపీ చేతులో పెట్టుకొని వరుసలో నుంచోవాల్సి వచ్చేది. గాంధీ శారీరక శ్రమచేస్తానన్నా దానికి అనుమతి లభించలేదు.
జైలు ఆహారం భారతీయులకు సరిపడదు. ఉదయం, సాయంత్రం వారికి ఒక రకమైన జొన్న జావ ఇచ్చేవారు. పంచదార, పాలు, నెయ్యి ఏమీ ఉండేవి కావు. వారు ఆ ఆహారాన్ని తినలేకపోయేవారు. కొన్ని సాయంత్రాలు కేవలం ఉడకబెట్టిన చిక్కుడు గింజలు మాత్రమే పెట్టేవారు. ఉప్పు తప్ప ఏ రకమైన మసాలా దినుసులు, పంచదార వాడేవారు కాదు. యూరోపియన్ ఖైదీలకు మాంసం, బ్రెడ్డు, కూరగాయలు పెట్టేవారు.
ఆ కూరగాయల తొక్కులు, మిగిలిన కూరగాయలతో కలిపి వండి నల్ల ఖైదీలకు పెట్టేవారు. 100 మంది భారతీయ ఖైదీల సంతకాలతో గాంధీ జైలు అధికారులకు ఒక ఫిర్యాదు పెట్టాడు. ‘‘ఇది భారతదేశం కాదు, రుచికరమైన ఆహారమేదీ మీకు ఇవ్వడం కుదరదు’’ అని ఆయనకు సమాధానం వచ్చింది. 15 రోజుల్లోనే గాంధీ భారతీయులకు బియ్యం, బ్రెడ్, కూరగాయలు, నెయ్యి కోటాను మంజూరు చేయించగలిగాడు. తమ ఆహారాన్ని స్వయంగా వండుకొనేందుకు కూడా నల్ల ఖైదీలకు అనుమతి లభించింది. గాంధీ వంటలో సహాయం చేసేవాడు, రోజూ రెండుసార్లు ఆయనే ఖైదీలకు వడ్డించేవాడు. ఇంకా మెరుగైన ఆహారం కావాలని, ఇంకొంచెం ఆహారం కావాలని అడగకుండానే గాంధీ అనుచరులంతా ఉడికీ ఉడకని జావను పంచదార లేకుండానే తినేసేవారు. మూడోసారి జైలుకి వెళ్లినప్పుడు ఆయనకు ఆహారం పెద్ద సమస్యకాలేదు. గాంధీ పూర్తిగా ఫలాలమీద జీవించాడు, ఆయనకు కావాల్సినన్ని అరటిపళ్లు, టమోటాలు, గింజలు ఇచ్చారు. జైలులోని క్రమశిక్షణా నియమాలు ఆయనకు నచ్చాయి. జైలులోంచి బయటకు వచ్చిన తర్వాతకూడా ఆయన టీ మానేశాడు, సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ముగించడాన్ని కొనసాగించారు.
దక్షిణాఫ్రికాలో ఆ తర్వాత రెండు జైలుశిక్షల సమయంలో గాంధీ చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆయనకు కఠిన శారీరక శ్రమను శిక్షగా విధించాడు. పదేళ్లపాటు న్యాయవాదిగా వాదించిన న్యాయస్థానమే ఆయనను సంకెళ్ళతో జైలుకి పంపించింది. ఆయనకు ఒక దేశవాళీ ఖైదీ దుస్తులు- అంటే ఒక చిన్న మిలటరీ టోపీ, ఖైదీ నంబరు, వెడల్పైన బాణం గుర్తులు ముద్రించి ఉన్న వదులైన ముతక కోటు, అలాంటి గుర్తులతోనే వున్న పొట్టి పాంటు, ముదురు బూడిదరంగు ఊలు మేజోళ్ళు, తోలు చెప్పులు ఇచ్చారు. వడగళ్ల వానలో తన పక్కబట్టలు నెత్తిన పెట్టుకొని ఆరు ఫర్లాంగులు నడవాల్సి వచ్చింది. అత్యంత చెడ్డవారైన నీగ్రో, చైనా ఖైదీలతో కలిపి ఆయనను ఉంచారు. జైలులో ఖైదీలు కొందరు ఆయన్ను దూషించి కొట్టారు. మరుగుదొడ్డికి మరుగు లేదు. వారి అసభ్యమైన ప్రవర్తన గాంధీని భయపెట్టింది. వారి భాష ఆయనకు అర్థమయ్యేది కాదు. ఆయన్ను వెంటనే 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు వున్న ఇరుకు గదిలో ఏకాంతంగా ఉంచారు. పైకప్పుకు దగ్గరలో గాలి ఆడేందుకు చిన్న ఖాళీ ఉండేది.