Others

పరులను హింసించడమూ పాపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614
*
తాళం వేసి వున్న తలుపు వెనకాల నిలబడి తన ఆహారం తినాల్సి వచ్చేది. వ్యాయామం కోసం రోజుకు రెండుసార్లు బయటకు తీసుకువెళ్ళేవారు. అన్నంతోపాటు నెయ్యి ఇవ్వనందుకు నిరసనగా ఆయన 15 రోజులపాటు అన్నం తినలేదు. కేవలం రోజుకోసారి ఇచ్చే రాగి జావ మాత్రమే తిని బతికాడు. ఆ తర్వాత అతనికి నెయ్యి, బ్రెడ్ ఇచ్చారు. ఆయనకు ఒక కొబ్బరి పీచు చాప, ఒక చెక్క దిండు, రెండు కంబళీలు, కొన్ని పుస్తకాలు ఇచ్చారు. రోజుకి ఒక బక్కెట్టు నీళ్ళు ఇచ్చేవారు. మల మూత్రాల బక్కెట్టు గదిలోనే ఒక మూల ఉండేది. చీకటి పడిన తర్వాత ఖైదీని గమనిస్తూ ఉండేందుకు ఒక కరెంటు బల్బు వేసి ఉంచేవారు, అది పుస్తకం చదివేందుకు పనికిరానంత తక్కువ కాంతితో ఉండేది. ఎప్పుడైనా మార్పు కోసం ఆయన ఆ ఇరుకు గదిలోనే అటు, ఇటు పచార్లు చేసేవాడు. అపుడు వార్డరు ‘అలా నడవొద్దు, గచ్చు పాడవుతుంది’ అని కేకలు వేసేవాడు. ఇంతకూ ఆ అద్భుతమైన గచ్చును తారుతో చేశారు.
స్నానానికి గాంధీ అనుమతి అడిగితే వార్డరు నగ్నంగా వెళ్లమనేవాడు. 125 అడుగుల దూరం దిశమొలతో నడవటం గాంధీవల్ల అయ్యేది కాదు. స్నానాల గదికి తలుపుగా గుడ్డ తెరను వాడటానికి ఆయన చేసిన విజ్ఞప్తిని ఆమోదించారు. కాని ఆయన వంటిని పూర్తిగా శుభ్రం చేసుకొనే లోపే ‘చాల్లే బయటకు రా’ అనే కేక వినబడేది. వెంటనే బయటకు రాకపోతే ఒక నీగ్రో వచ్చి ఈడ్చుకొచ్చేవాడు.
గాంధీ రోజుకు తొమ్మిది గంటలపాటు చొక్కా జేబులు కత్తిరించాల్సి వచ్చేది. చిరిగిన దుప్పటి ముక్కలను కుట్టాల్సి వచ్చేది, వార్నిషు చేసిన ఇనుప తలుపును పాలిష్ చేయాల్సి వచ్చేది. ఆ తలుపులను మూడు గంటలపాటు రుద్దాక చూస్తే అవి మొదట్లో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఆయనకు మరుగుదొడ్లు కడిగే పని అప్పగించారు. ఆయన ఈ కష్టాలన్నీ నవ్వుతూ భరించాడు. కాని సహచరుల అవస్థలు ఆయన్ను కదిలించి వేశాయి. నిరాశా నిస్పృహలతో కొంతమంది ఏడిచారు, మరికొంతమంది సొమ్మసిల్లిపోయారు. వారిని ఇళ్ళల్లోంచి బయటకు లాక్కొచ్చి ఇలా బాధలతో, అవమానంతో కూడిన జీవితాన్ని గడపటానికి తానే బాధ్యుడు. తన త్యాగం ద్వారా, తాను బాధను అనుభవించడం ద్వారా మాత్రమే వారికి విముక్తి కలిగించగలని గాంధీ నమ్మాడు. ఆ ఆలోచన ఆయనకు కొంత మనశ్శాంతిని ఇచ్చింది.
మలమూత్ర విసర్జనల పని ఉదయం ఆరు గంటలకల్లా అయిపోవాలి. ఉదయం ఏడుగంటలకల్లా పని మొదలయ్యేది. వారు తొమ్మిది గంటలపాటు పనిచేసేవారు. గాంధీ ఒక మైలు నడిచిన తర్వాత పలుగు తీసుకొని ఎండిపోయిన నేలను తవ్వేవాడు. ఆయన బరువు తగ్గాడు, నడుం నొప్పి పెట్టేది. ఆయన చేతులు బొబ్బలెక్కి చితికి నీరు కారేవి. చాలా కష్టంమీద ఆయన తవ్వగాలను లేపగలిగేవాడు. విశ్రాంతికి కొద్దిసేపు పని ఆపితే గార్డులు ‘కానీయ్ కానీయ్’ అని అరిచేవారు. గార్డు తన ప్రవర్తన మార్చుకోకపోతే మొత్తం పని మానేస్తానని గాంధీ హెచ్చరించాడు. దాంతో గార్డు కొంచెం తగ్గాడు. తనకు కేటాయించిన పని పూర్తిచేసి గౌరవం కాపాడుకొనే అవకాశం తనకివ్వమని దేవుని ప్రార్థించేవాడు.
భారతదేశంలో ‘హిజ్ మెజెస్టీస్ హోటల్’లో గాంధీ ఉన్నపుడు ఆయన ఖర్చంతా ప్రభుత్వమే భరించేది. అయినా తన నిర్వహణ కోసం ఒక్క పైసా కూడా అదనంగా ఖర్చుచేయడం ఆయనకు ఇష్టముండేది కాదు. ఒక సందర్భంలో అధికంగా వున్న వస్తువులు, కుండలు, పళ్లాలు తీసేయమని ఆయన జైలు సూపరిండెంట్‌ను అడిగాడు. ఒక ఇనుప మంచాన్ని, చాలా తక్కువ గినె్నలను గాంధీ ఉపయోగించేవాడు. జైల్లో చేసే ఖర్చంతా భారతదేశంలో నోరులేని లక్షలాది పేదల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తారని ఆయనకు తెలుసు. ఆగాఖాన్ పాలెస్‌లో గడిపిన తన ఆఖరి జైలు జీవితం గురించి మాట్లాడుతూ, ‘‘నన్ను ఇంత పెద్ద పాలెస్‌లో ఉంచి, నా చుట్టూ గార్డులను నియమించడంవల్ల చాలా ప్రజాధనం వృధా అవుతోంది. అనేకమంది ప్రజలు ఆకలితో మాడే పరిస్థితిలో వుండగా ఇలా చేయడం నేరంతో సమానం’’ అన్నాడు.
భారతదేశంలో గాంధీ ఎదుర్కొన్న మొదటి కోర్టు విచారణ మరిచిపోలేని సంఘటన.