Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు తెర సెల్లామీద కుంచె వేయని చిత్రమేదో
అంచురెప్పల్ని తాకి ఆవిరౌతుంది
తొలికాంతి చినుకొకటి
గాఢాలింగనాన్ని శీకరించింది తూర్పు
సంజ నారింజ రసాన్ని చిగురు చివళ్ళమీంచి ఒలికిస్తోంది
కొనసాగిన బొడ్డు తమ్మిలా
నేలలోంచి శిరసెత్తిన శిఖరికి ప్రదక్షిణం చేస్తోంది పక్షి
చిరుగాలికి చివుళ్ళెత్తిన రాగశయంగా
గొంతెత్తింది శకం- దాని పేరు పికం
నిరంతరాభిముఖంగా సాగిపోతోన్న కాలానికి
హస్తగతమైన అనుభవాలన్నీ
మనిషికెప్పటికప్పుడు క్రొత్తే
ఆకాశపు రసధుని అనురాగాపగ నందిని
తుందరించు తరగ కలల్ని
పొలాల్లో తృషిత గళాల్లో ఫలింపజేయటం
పాతైనా- నాకెప్పుడూ నిత్యనూతనాభిధే
రాత్రి తెల్లారిందని కలలు గాలికి కొట్టుకుపోవు
జ్ఞాపక జలాల్లో కేకిసలాడే
నగ్నమూర్తుల నాదహంసలై నినదిస్తునే వుంటాయి...
ఏ పౌరాతన్యాన్ని ఎదమీద మోసుకొచ్చిందో
ఆ ప్రవాహం నా ఊహల్ని అధిగమించి
అంతర్వేలను చెరిపేసింది- ఓహో
ఉపద్రష్ట జగన్నాధుడా- ఇది
నీవు మునిగిన గంగే...
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404