Others

జైళ్లు విద్యాలయాలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదిగో ఇక్కడ నా చిట్టి విమల ఉంది, అక్కడ హరి కూర్చున్నాడు,’’అంటూ లేఖలు రాసేవాడు.
క్రమశిక్షణతో కూడిన జైలు జీవితంయొక్క లాభాలను గాంధీ గమనించాడు, ఒక ఆదర్శవంతమైన ఖైదీ ఎలా ఉండాలో వర్ణించాడు. అనైతికమైన పనులేమీ చెప్పనంతవరకూ జైలులో ఏ పని చెబితే ఆ పని చేయాలనీ, జైలు నిబంధనలన్నీ పాటించాలని ఆయన చెప్పేవాడు. అవమానిస్తే లేదా అపరిశుభ్రమైన ఆహారమిస్తే తప్పించి నిరాహారదీక్షకు సిద్ధపడేవాడు కాదు. ఆయన కానీ, ఆయన సహచరులు కానీ ఎప్పుడు మోకాళ్లమీద కూర్చునేవారు కాదు, ఎప్పుడూ ‘‘దొరా, దండాలు’’అని అరిచేవారు కాదు.
స్వరాజ్యంలో కూడా జైళ్లను నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని గాంధీ ఒప్పుకున్నాడు. తాత్కాలికంగా తప్పుదోవ పట్టిన, మానసిక సమతుల్యం కోల్పోయిన వారిని బాగుచేసేందుకు అవసరమైన విద్యాలయాలుగా, శిక్షణా సంస్థలుగా, పరివర్తనాశాలలుగా జైళ్లను మార్చాలని ఆయన కోరుకునేవాడు.
ఒకసారి ఆయన జైలులో ఉండగా ఖైదీలతో ఉత్పత్తి కార్యక్రమాలు చేయించడం ద్వారా జైళ్లను స్వయంపోషకాలుగా ఎలా మార్చవచ్చో సూచిస్తూ ఒక ప్రతిపాదన చేశాడు. ఒక ఖైదీనుంచి వచ్చిన ప్రతిపాదనను జైలు అధికారులు ఆమోదించలేదు.
ఈ ఆదర్శ ఖైదీ ఒకోసారి చాలా మొండిగా ప్రవర్తించి జైలు అధికారులను ఇబ్బందిపెట్టేవాడు. బ్రెడ్ తినటానికి అనుమతించినప్పుడు కాల్చిన బ్రెడ్ తినలేం కాబట్టి దానిని ముక్కలు కోసుకొనేందుకు కత్తికావాలని పట్టుపట్టాడు. ఆయన రోజువారీ నడకలకు మరింత ప్రదేశం కావాలని అడిగేవాడు. తన స్నేహితులను తనమీద ఆధారపడిన వారుగా భావించి తన ప్రత్యేక సంరక్షణ కింద ఉంచాలని కోరేవాడు. ఆస్తమాతో బాధపడుతున్న వారికో, ప్రకృతి చికిత్స అవసరమైన వారికో, ఆయుర్వేద చికిత్స అవసరమైన వారికో చికిత్సచేయడం తన సొంత బాధ్యతగా భావించి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరేవాడు. సుదీర్ఘమైన ఉపవాసాలకు పూనుకోవడం ద్వారా ఆయన తన కోరికలకు అంగీకరించేలా పరోక్షంగా జైలర్లపై వత్తిడి తెచ్చేవాడు. ఆయన పరిస్థితి క్షీణించినప్పుడల్లా ఆయన్ను జైల్లోంచి విడుదల చేసేవారు. మహాత్మాగాంధీలా ప్రపంచ ప్రసిద్ధిపొందిన పౌరుడిని తమవద్ద ఉంచుకొని ఆయన ప్రాణాలకు బాధ్యత వహించడం అనే ప్రమాదాన్ని భరించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఆయనకు అపెండిసైటిస్ వచ్చినప్పుడు వాళ్లు చాలా శ్రద్ధచూపించి వెంటనే శస్తచ్రికిత్స చేయించారు. ఆయన జైల్లో ఉండగా రెండుసార్లు జబ్బుపడ్డాడు.
గాంధీ ఎప్పుడూ తన పరిచారకులు, సహచరుల బృందంతోనే జైలుకు వెళ్లేవాడు. ఆగాఖాన్ పాలెస్‌లో ఆయనను నిర్బంధించినప్పుడు ఆయనతో కస్తూర్బా, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయి ఉన్నారు. ఆ ఇద్దరూ అక్కడే మరణించారు. వారిని అక్కడే జైలుగోడల లోపలే ఖననం చేశారు. ‘‘డూ ఆర్ డై నినాదాన్ని వాళ్లు అక్షరాలా పాటించి స్వాతంత్య్ర బలిపీఠానికి తమ ప్రాణాలను అర్పించారు, వారు అమరులు.’’ అన్నాడు గాంధీ.
సైన్యాధ్యక్షుడు
గాంధీని దక్షిణాఫ్రికా ఒక మనిషిగా చేసింది. 23యేళ్ల వయసులో ఆయన దర్బను చేరుకున్నారు. అప్పటివరకూ ఆయన కంగారు, బిడియాలతో నిండిన యువకుడు మాత్రమే. భారతీయులను, నల్లవారిని తెల్లవారు ఎలా చిన్నచూపుచూస్తారో దక్షిణాఫ్రికా నేలమీద కాలుపెట్టగానే ఆయన గమనించాడు. భారతీయులను తెల్లవాళ్లు ‘కూలీ’అని పిలిచేవారు.
ఆయన దక్షిణాఫ్రికాలో దిగిన మూడో రోజు దర్బను కోర్టుకు వెళ్లారు. అక్కడ మేజిస్ట్రేటుకు గౌరవం చూపించడంకోసం ఆయనని తలపాగా తీసేయమని ఆదేశించారు. గాంధీ దాన్ని అవమానంగా భావించి, కోర్టునుంచి బయటికి వచ్చేశాడు.
ఒక వారం తర్వాత రైలులో గాంధీ వేరే పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఫస్ట్‌క్లాస్ టికెట్ కొనుక్కొని, ఫస్ట్‌క్లాస్ పెట్టెలో ఎక్కి కూర్చున్నాడు. తర్వాతి స్టేషనులో టికెట్ తనిఖీ అధికారి వచ్చి ఆయన్ని థర్డ్‌క్లాస్ పెట్టెలోకి మారమని ఆదేశించాడు. తనకు ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణం చేసే అధికారం ఉందని నిరూపించుకుందామని ప్రయత్నించే లోగానే బలవంతంగా రైల్లోంచి బయటకు లాగి పడేసారు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614