Others

సూర్యోదయంలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాళీ చేయబడ్డ
మహా శూన్యంలోంచి
ఓ దృశ్యం

జీవితంగా చిగురు తొడిగి
దేదీప్యమానంగా వెలిగిపోతుంది
అంతుచిక్కని ఈ చిక్కుముడిని
బహిరంగ రహస్యంగా విప్పిపరిస్తే

మరుక్షణమే
హృదయ ప్రపంచమంతా
నీ పాదాక్రాంతమవుతుంది

కొద్ది క్షణాలు
నాలోకి నేనే ప్రత్యక్షమవుతాను
లోలోపటి ఒంటరితనమంతా
కళ్లముందే బద్దలై
మహా విస్ఫోటనాన్ని సృష్టిస్తుంది

దాని పేరే
అలజడి
అలల జడి

నాతోవున్న జ్ఞాననేత్రం
నీలో విచ్చుకోదు

వౌనంలో కరిగిపోతున్న
ఉక్కపోతని మించిన చలనం
ఈ దేహంలో ఏముంది?

ప్రతి క్షణం
రంగులు మారుతూనే ఉంటాయ

నీడల్లాంటి
భౌతిక నిజాలను పసిగట్టలేక
ఏదో ఒక సందర్భంలోంచి
ఈ అడుగుల ప్రయాణం
చప్పుడు మొదలవుతుంది

కదిపి చూస్తే కాలే కడుపూ
కూలే మిద్ది ఒకే రకమైన
ఆకలి చితిమంటల్లోంచి రాల్చిన
ఆర్థిక పూల పుప్పొడి వాసన

కాసింత సున్నితత్వాన్ని
బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే
చప్పటి జీవితమంతా
రుచిమయ దృశ్యంగా మారిపోతుంది

తడిసిన ఖాళీతనం లోంచి
ఒంటరి జీవితాన్ని
నెమరేసుకోనవసరం లేదు

కొత్తగా పొడిచిన పొద్దులా
పరిచిన అడుగులు
మళ్లీ తిరిగి
సూర్యోదయంలోకే...!

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910