Others

అహింసే అత్యంత దృఢం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతరులు ఈ సందేశాన్ని పట్టణానికి దూరంగా నివశిస్తున్న వందలాది మందికి చేరవేశారు. ఒక నెలలో నిధులు పోగయ్యాయి. బిల్లుకు నిరసనగా 10వేల మంది సంతకాలు సేకరించారు. నిరసన లేఖలను ముద్రించి నాటల్ గవర్నర్‌కు, ప్రీమియర్‌కు, భారతదేశపు వైస్రాయికి, విక్టోరియా మహారాణికి, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండు, భారతదేశాల్లోని వార్తాపత్రిలకు పంపారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులకు జరుగుతున్న అన్యాయానికి విస్తృతమైన ప్రచారం లభించింది. అయినా బిల్లు పాసయ్యింది, భారతీయులు ఓటు హక్కు కోల్పోయారు. కానీ భారతీయులు తమ మొహమాటం, నిర్లిప్తత వదులుకోవడం నేర్చుకున్నారు. అన్యాయమైన చట్టాలు చేస్తున్న ప్రభుత్వ అధికారాన్ని ఎదిరించడం నేర్చుకున్నారు. గాంధీ త్వరలోనే నాటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించి, దానికి నియమ నిబంధనలు ఏర్పరిచాడు, తానే స్వయంగా సభ్యుల నుంచి నిధులు వసూలు చేశాడు.
దక్షిణాఫ్రికాలో ఆయన వున్న 20 సంవత్సరాల కాలంలో గాంధీ అనేక నల్ల చట్టాలకు వ్యతిరేక పోరాటాలలో ప్రజలకు నాయకత్వం వహించాడు. ప్రతి భారతీయ వయోజనుడి నుంచి 40 రూపాయల వార్షిక పన్ను విధించే చట్టం వాటిల్లో ఒకటి. భారతదేశంలో చేసుకున్న పెళ్లి దక్షిణాఫ్రికాలో చట్టప్రకారం చెల్లుబాటు కాదని చెప్పే చట్టం మరొకటి, ప్రతి భారతీయుడూ తన పదివేళ్ల ముద్రలతో వ్ను దృవపత్రాన్ని తమ వెంట ఉంచుకు తిరగాలనే చట్టం మూడోది. వేలిముద్రలు నేరస్థులనుంచి తీసుకుంటారు కాబట్టి గాంధీ దీనికి వ్యతిరేకంగా డజన్లకొద్దీ వ్యక్తులకు వందలాది ఉత్తరాలు, విజ్ఞప్తులు, ఫిర్యాదులు పంపాడు. ముఖ్యమైన ప్రభుత్వాధికారులను స్వయంగా కలుసుకున్నాడు. వేదికలద్వారా, పత్రికల ద్వారా చేసిన నిరసన ఉద్యమాలు విఫలమయ్యాక గాంధీ సత్యాగ్రహమనే అహింసాయుత నిరసనను కొత్త ఆయుధంగా రూపొందించాడు.
వేలిముద్రల సేకరణను బహిష్కరించమని గాంధీ భారతీయులకు పిలుపును ఇచ్చాడు. సుదీర్ఘమైన అహింసాత్మకమైన నిరసనకు సిద్ధంకావాలని, అవసరమైతే జైలుకు వెళ్ళాలి, ప్రాణాలు పణంగా అయినా పెట్టాలి కాని ఈ దుష్ట చట్టానికి మాత్రం లొంగవద్దని ఆయన ఉద్బోధించాడు. ‘నేను చావంటే భయాన్ని తరిమివేయాలని అనుకుంటున్నాను. స్వచ్ఛందంగా బాధలను అనుభవించడానికి సిద్ధం కావడమే అన్యాయాలను తొలగించడానికి సత్వరమైన మార్గం’’ అనేది ఆయన నినాదం. కేవలం తనమీద ఆధారపడితే ఆశయాన్ని సాధించలేరనీ, తాను చెప్పిన మార్గాన్ని అర్థం చేసుకొని చివరిదాకా అనుసరిస్తేనే లక్ష్య సాధన సాధ్యమవుతుందని ఆయన వారిని హెచ్చరించాడు. ఆయన సూచనలను హిందీ, గుజరాతీ, తమిళం, తెలుగు భాషలలో ప్రజలకు వివరించేవారు. పూర్తిస్థాయి అహింసాయుతంగా పోరాటం చేస్తామని ఆయన కార్యకర్తల సైన్యం ప్రతిజ్ఞ చేసింది. వీధుల్లోని నిరక్షరాస్యులు, వృత్తికళాకారులు, చిల్లర వ్యాపారులు, గని కార్మికులు, వ్యాపారులు, మహిళలు ఈ సైన్యంలో చేరారు. నిరాయుధులైన, శాంతియుతమైన క్రమశిక్షణ గల 5వేలమంది కార్యకర్తల సైన్యానికి గాంధీ కాలినడకన నాయకత్వం వహించారు. ఆయన తన సమూహంతోకలిసి నడిచాడు, ఆరుబయట పడుకున్నాడు, నీళ్ల పప్పును, ఉడికీ ఉడని అన్నాన్ని వారితో పంచుకున్నాడు. అనారోగ్యంతో వున్నవారికి చికిత్స చేశాడు. నిరుత్సాహంగా వున్నవారిని ఉత్సహపరిచాడు, వంట చేశాడు, వడ్డించాడు. శారీరకంగానూ, మానసికంగానూ అత్యంత దృఢత్వాన్ని ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2500 మందికి కఠిన శారీరక శ్రమను శిక్షగా విధించింది. 1000 మంది పూర్తిగా శిథిలమైపోయారు. కొంతమంది మరణించారు. ధనికులైన వ్యాపారులు సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి వాళ్ల నాయకుడితో కలిసి జైలులో రాళ్లు కొట్టారు, పారిశుద్ధ పని చేశారు. కస్తూర్బా కూడా సత్యాగ్రహంలో చేరి జైలుపాలయ్యింది. ఇంగ్లాండులో గాంధీ ఉద్యమానికి సానుభూతి లభించింది. భారతదేశంలో కాంగ్రెస్ సభల్లో దక్షిణాఫ్రికా సమస్యను చర్చించారు. కాంగ్రెస్‌కూ అధ్యక్షునిగా పనిచేసిన సర్ వెడ్డర్‌బర్న్ అనే ఆయన ‘హిందూ, ముస్లింలు ఐకమత్యంగా భుజం భుజం కలిపి నిలబడితే ఏం సాధించగలమనేదానికి దక్షిణాఫ్రికా నుంచి లభించిన తాజా కబురు ఉదాహరణగా నిలుస్తోంది. గాంధీ అద్భుత నాయకత్వంలో అక్కడి భారతీయులు చూపిన పట్టుదలకు ధన్యవాదాలు’’ అన్నాడు. యాత్ర నిర్వహించినప్పుడు రోజువారీ ఖర్చులకు గాంధీకి 3200 రూపాయలు అవసరం అయ్యేవి. నిధులు కావాలని గాంధీ భారతదేశానికి అభ్యర్థన పంపాడు. మహిళలు తమ గాజులను, భర్తల చేతి ఉంగరాలను పంపారు, యువరాజులు, వర్తకులు వేలాది రూపాయలు విరాళాలు పంపారు, టాగూరు స్వయంగా విరాళాలు సేకరించి పంపాడు. సుదీర్ఘమైన ఆ పోరాటం భారతీయులకు అనుకూలమైన రాజీతో ముగిసింది. ఆత్మగౌరవానికి భంగం కలగనంత వరకూ గాంధీ రాజీకి అంగీకరిస్తూనే ఉండేవాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614