Others

ముత్యాలముగ్గు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు బాపు తీసిన సోషియో ఫాంటసీ. సంసారంలో అనుమానమనే విష బిందువు చిలికి చిందరవందరై.. భార్యాపరిత్యాగము, భర్తవియోగం, బిడ్డల ఆలనాపాలనా.. స్ర్తిజీవితంపై పడిన మచ్చవలన వచ్చిన సంఘర్షణతో బాపూ గీసిన అందమైన సెల్యులాయిడ్ చిత్రం ముత్యాలముగ్గు.
జమిందారీ వ్యవస్థ అంతమైపోతూ, భేషజాలు తగ్గక, భార్య లేని సంసారమును కోడలి రూపంలో చూసుకోవచ్చన్న తపన ఈ చిత్రంలో కనబడుతుంది. దుష్టచతుష్టయమగు నల్గురువలన పెళ్ళికూడా పెటాకులై, సంసారం రెండాకులై విలవిలలాడింది. కమర్షియల్ చిత్రాలు వెండితెరను అమాంతం మింగివేస్తున్న డెబ్భై దశకంలో బాపూరమణలిద్దరు జంటమిత్రులై సునిసితమగు హాస్యము, వినూత్న తరహావంటి విలనిజం, మేకప్‌లు లేకుండా సహజత్వానికి చిరునామాగా, గోదావరి నది సైకత తీరంలో కుప్పలుకుప్పలుగా పోసి, వాసికెక్కిన కథనొకటి ఎన్నుకొని సెల్యులాయిడ్‌పైకి ఎక్కించి హిట్‌కొట్టిన ఘనత బాపూగారిది- బాపూ చిత్రాలన్నీ విలక్షణమైనవే. సమస్యలన్నీ స్ర్తిల చుట్టూ పరిభ్రమిస్తుంటాయవే.
‘‘డైరెట్రూ పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశము, సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ!’’ అంటూ ‘రావుగోపాలరావు’ నటనకి గొప్ప మలుపుతిప్పిన చిత్రం. ఇద్దరి పిల్లల నడుమ తండ్రికోసం పడే తపన అమ్మాయికి ఆంజనేయుడు పౌరాణికంగా, తమ్ముడికి కోతి రూపంలో రియలిస్టిక్ అండదండా వుండి దుర్మార్గులకు బుద్ధిచెప్పించిన వైనం అఖిలాంధ్ర కోటిని మంత్రముగ్ధుల్ని చేసిన హిట్ పాటలున్న చిత్రం ముత్యాలముగ్గు- డైలాగ్‌లు రికార్డు సృష్టించింది. ఏ సినిమాహాలు దగ్గరైనా, టీ సెంటర్లోనైనా, నల్గురు కూర్చొని మాట్లాడుకొనేచోటైనా చెప్పుకొనేంత పాపులారిటీ స్థాయిని అందుకొన్నాయి.
సంగీతానికి కె.వి.మహదేవన్ సారధ్యం, ఎస్‌పి, సుశీల, బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్ గానం, నటుడు శ్రీ్ధర్, సంగీత, కాంతారావు, సూర్యకాంతం, రావుగోపాలరావు, అర్జాజనార్ధనరావుల నటనకు గొప్ప లాండ్ మార్కుగా నిల్చింది. అల్లుకి మెంటల్ నటన ప్రేక్షకుడిని తారాస్థాయికి తీసుకెళ్ళింది. మసక మసక వెలుతురు, కొత్త పెళ్లికూతురు, ఏదోఏదో అన్నది... ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ఎంతటి రసికుడవో తెలిపెదా, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... అంటూ ఆరుద్ర, సి.నా.రె, గుంటూరు శేషేంద్రశర్మలు లిరిక్స్ వ్రాశారు. తెలుగు లోగిళ్ళలోను ప్రతిధ్వనించిన గొప్ప సాహితీ విలువల చిత్రంగా ‘ముత్యాలముగ్గు’చెప్పుకోవచ్చు- అనుభూతిని మిగిల్చే చిత్రం.

-ఎల్ శ్రీనివాసరావు, అద్దంకి